Double ismart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో డబుల్‌ హిందీ యాక్టర్స్‌… కొత్తగా ఎవరొస్తున్నారంటే?

  • February 20, 2024 / 12:34 PM IST

తెలుగు సినిమాలో బాలీవుడ్‌ విలన్‌… ఇప్పుడు ఇదే ట్రెండ్‌ నడుస్తోంది. వరుసగా తెరకెక్కున్న పెద్ద తెలుగు సినిమాల్లో బాలీవుడ్‌ విలన్‌ కచ్చితంగా ఉంటున్నారు. తాజాగా మరో తెలుగు సినిమాలో బాలీవుడ్‌ నటుడిని విలన్‌గా తీసుకుంటున్నారు అని ఓ టాక్‌ నడుస్తోంది. అయితే నిజానికి ఆయన రెండో బాలీవుడ్‌ నటుడు అవుతాడు. ఎందుకంటే ఆల్‌రెడీ ఒక నటుడు అందులో ఉన్నాడు కాబట్టి. ఫస్ట్‌ చేరిన నటుడు సంజయ్‌ దత్‌ కాగా.. ఇప్పుడు వస్తున్న నటుడు బాబీ డియోల్‌.

రామ్ పోతినేని – పూరి జగన్నాధ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. గతంలో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాకు ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ చిత్రం షూటింగ్‌ మూడో కంటికి తెలియకుండా వేగంగా పూర్తి చేస్తున్నారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ వచ్చినప్పుడు హీరో, దర్శకుడి పరిస్థితి ఎలా ఉందో? ఇప్పుడు కూడా అలానే ఉండటమే సినిమా లోప్రొఫైల్‌కి కారణం అని అంటున్నారు. అందుకే అప్‌డేట్స్‌ పెద్దగా రావడం లేదు అని టాక్‌.

ఇక లేటెస్ట్‌ పుకార్ల ప్రకారం అయితే (Double Ismart) ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో ఓ కీలక పాత్ర కోసం బాబీ డియోల్‌ను సంప్రదించారట. ఇప్పటికే విలన్‌ పాత్ర కోసం సంజయ్‌ దత్‌ను తీసుకున్నారు. మరో బ్యాడీ అవసరం పడి… బాబీని పిలుస్తున్నారు. కాగా ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న విడుదల చేస్తామని టీమ్‌ చెప్పింది. కానీ పరిస్థితి చూస్తుంటే అలా వచ్చేలా లేదు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారు.

మామూలుగా తెలుగు హీరో – హిందీ విలన్‌ కాంబినేషన్‌ వస్తేనే బ్లాక్‌ బస్టర్‌ కాంబో అంటున్నారు. అలాంటిది ఇద్దరు బాలీవుడ్‌ నటులు వస్తే డబుల్‌ బ్లాక్‌బస్టర్ అంటారేమో అనే కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. కానీ రెండు హైఓల్టేజ్‌ క్యారెక్టర్లతో రామ్‌ లాంటి ఎనర్జిటిక్‌ హీరో కలిస్తే వచ్చే మజా మామూలుగా ఉండదు అని చెప్పొచ్చు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus