ఆకట్టుకుంటున్న ‘అశ్వద్దామ’ థర్డ్ సింగిల్!
- January 20, 2020 / 10:58 PM ISTByFilmy Focus
ఇప్పటి వరకూ ఎక్కువగా లవ్ స్టోరీలు చేస్తూ వచ్చిన నాగ శౌర్య ఈసారి… పక్కా మాస్ హీరోగా మారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. అయన నటించిన ‘అశ్వద్దామ’ చిత్రం జనవరి 31 న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, మరియు ఫస్ట్ సింగిల్ కు అద్బుతమైన స్పందన లభించింది. ఒక రకంగా సినిమా పై అంచనాల్ని డబుల్ చేశాయనే చెప్పాలి. ఇప్పుడు మరో సింగిల్ ను కూడా విడుదల చేసారు.

“మహి .. చూస్తుంటే నువ్వలా .. అందాల బొమ్మలా ..” అంటూ ఈ పాట సాగుతోంది. హీరో చెల్లి పెళ్ళి దగ్గరుండి జరిపిస్తూ, ఆ సంబరాన్ని అందరితో కలిసి పంచుకునే అన్నయ్యగా ఈ పాటలో నాగశౌర్య కనిపిస్తున్నాడు. పూజన్ కోహ్లీ ఆలాపన .. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఆకట్టుకునేలా వున్నాయి. విశ్వరఘు కొరియోగ్రఫీని అందించిన ఈ సాంగ్ స్క్రీన్ పై మంచి సందడి చేస్తుందనే అనిపిస్తోంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











