RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

రామ్‌చరణ్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఆ మధ్య ఉంటుందా? ఉండదా? అనే డౌట్‌ రేగిన ఈ ప్రాజెక్ట్‌.. కచ్చితంగా ఉంటుంది అంటూ సినిమా ఆఫీసును ప్రారంభించారు. దసరా సందర్భంగా సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుంది అనే వార్త ఒకటి టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొట్టినా.. అది నిజం కాలేదు. సినిమా ప్రారంభం కాలేదు. దీంతో సినిమా కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితి.

RC 17 Movie

ఈ క్రమంలో మరో విషయం ఇప్పుడు చర్చకు వచ్చింది. అదే ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరు అని. మొన్నీమధ్య వరకు సారా అర్జున్‌ని హీరోయిన్‌గా ఓకే చేశారు అనే మాటలు వినిపించాయి. ఇప్పుడేమైందో ఏమో.. మరో బాలీవుడ్‌ యువ హీరోయిన్‌ పేరు వినిపిస్తోంది. ఈ మేరకు ఆమెతో టీమ్‌ సంప్రదింపులు జరుపుతోందట. అయితే సుకుమార్‌ మరీ యంగ్‌ హీరోయిన్‌ని తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో ‘రంగ స్థలం’ సినిమా సమయంలో సీనియారిటీకే ఆయన ఇంపార్టెన్స్‌ ఇచ్చారు.

ఇక ఇప్పుడు చర్చలోకి వచ్చిన హీరోయన్‌ ఎవరా అని చూస్తే.. అనీత్‌ పడ్డా. ‘సైయారా’ సినిమాతో బాలీవుడ్‌లో కుర్రకారును మెప్పించి, మైమరిపించిన హీరోయిన్‌ ఆమె. ఇప్పుడు ఈ సినిమాతో తెలుగులోకి రావొచ్చు అని చెబుతున్నారు. అయితే ఈ ఇద్దరూ ఈ సినిమాలో నటిస్తారా? ఇద్దరిలో ఒకరే నటిస్తారా అనేది త్వరలో తేలుతుంది. దీని కోసం సినిమాకు కొబ్బరికాయ కొట్టాలి. అయితే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ సందర్భంగా ఓ కాన్సెప్ట్ వీడియో సిద్ధం చేస్తున్నారు అని తెలుస్తోంది.

అందులో ఏమన్న క్లారిటీ వస్తుందేమో చూడాలి. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సమయంలో రామ్‌చరణ్‌పై సుకుమార్‌ ఎంట్రీ సీన్‌ తెరకెక్కించేశారు. మరి ఆ వీడియోను ఏమన్నా కాన్సెప్ట్‌ వీడియోగా రిలీజ్‌ చేస్తారా అనేది చూడాలి. ఇప్పటికే చాలా లేట్‌ అయిన నేపథ్యంలో చరణ్‌ ఏమన్నా ఈ సినిమా సూపర్‌ఫాస్ట్‌గా పూర్తి చేస్తాడేమో చూడాలి. అయితే సుకుమార్‌ ఈ విషయంలో కాస్త టైమ్‌ తీసుకునే రకం.

 ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

 

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus