Balakrishna: కొత్త పాట రిహార్సల్స్ చేస్తోన్న బాలయ్య!

  • June 1, 2021 / 06:25 PM IST

నందమూరి బాలకృష్ణ సందర్భాన్ని బట్టి తన పాటలతో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తుంటారు. గతంలో ‘మేము సైతం’ ఈవెంట్ లో తన గాత్రం వినిపించి అందరికీ షాకిచ్చారు బాలయ్య. అప్పటినుండి సింగర్ గా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారో ఏమో కానీ వరుసగా పాటలను రికార్డ్ చేసి వాటిని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘శివశంకరి’ అనే పాటను వినిపించిన బాలయ్య రీసెంట్ గా ‘శ్రీరామదండకం’ ఆలపించారు. శ్రీరామదండకాన్ని వినిపించడానికి బాలయ్య చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.

కొన్ని చోట్ల ఊపిరి తీసుకోకుండా మరీ పాడారు. ఈ దండకం బాలయ్య ఫ్యాన్స్ పాజిటివ్ కామెంట్స్ చేస్తే మరికొందరు మాత్రం నెగెటివ్ కామెంట్స్ చేశారు. అయినా ఈ విషయాలను బాలయ్య పెద్దగా పట్టించుకోరు. ఆయనపై ట్రోలింగ్ జరిగినా కూడా స్పందించరు. ఆయనకు నచ్చింది చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో బాలయ్య మరోసారి తన గొంతుని సవరించుకోబోతున్నారని సమాచారం. ఈసారి ఆయన నుండి మరో స్పెషల్ సాంగ్ రాబోతుంది.

ఈ మేరకు రిహార్సల్స్ చేస్తున్నారని.. రికార్డ్ చేసి ఉంచుకొని మంచి సందర్భం చూసి రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఇక కెరీర్ విషయానికొస్తే.. బాలయ్య ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus