Vishwambhara: ఉగాదికి ఇంకో వీడియో రెడీ చేయిస్తున్న చిరంజీవి.. రిలీజ్‌ డేట్‌ చెబుతారా?

‘మన శంకరవరప్రసాద్‌ గారు’ సినిమాకు వచ్చినంత హైప్‌ రాకపోవచ్చు.. అలా అని పూర్తిగా ఆ సినిమాను ఎవరూ పట్టించుకోరు అని చెప్పలేం. సరైన ప్రచారం చేస్తే.. కచ్చితంగా ‘విశ్వంభర’ సినిమాకు బజ్‌ వస్తుంది. దీనికి కావాల్సిందల్లా అట్రాక్ట్‌ చేసే, కాన్ఫిడెన్స్‌ పెంచే టీజర్‌ / ట్రైలర్‌. ఇప్పుడు అదే పనిలో ఉంది అంటున్నారు సినిమా టీమ్‌. మొన్నామధ్య రకరకాల పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ చిరంజీవి స్వయంగా వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి ‘విశ్వంభర’ సినిమా పోస్ట్‌ పోన్‌ గురించి చెప్పుకొచ్చారు.

Vishwambhara

ఇప్పుడు, మరోసారి ఆయన మరో వీడియోతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు అని సమాచారం. ఉగాది పర్వదినం సందర్భంగా ‘విశ్వంభర’ సినిమా టీమ్‌ ఓ వీడియోను రిలీజ్‌ చేయనుంది అని సమాచారం. చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా చాలా కాలంగా నిర్మాణం / నిర్మాణానంతర పనుల్లో ఉంది. ప్రస్తుతం ఆ పనులు ఓ కొలిక్కి వచ్చాయి అని అంటున్నారు. అందుకే ఉగాదికి సినిమా రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేస్తారని టాక్‌.

‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమాలోని వినోదం, ‘హిట్లర్’ సినిమాలోని ఫ్యామిలీ డ్రామ్‌ కలగలిపిన సోషియో ఫాంటసీ కథ ఈ సినిమా అని చెబుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్‌ గురించి చిరంజీవి ఇటీవల మాట్లాడారు. మీడియా మిత్రులను చిరంజీవి ఇంటికి పిలిచి చాలాసేపు మాట్లాడారు. అప్పుడే ‘విశ్వంభర’ సినిమా టాపిక్‌ చర్చకు వచ్చింది. జూన్ లేదా జులైలో ఈ సినిమాను రిలీజ్‌ చేసే ఆలోచనలో ఉన్నామని.. చాలా వరకు జులై రెండో వారంలోనే సినిమా ఉండొచ్చు అని క్లారిటీ ఇచ్చేశారు చిరంజీవి.

అయితే ఇక్కడ సమస్య ఏంటంటే.. ఆ టైమ్‌కి వశిష్ట సినిమా రెడీ చేస్తారా అని. చూద్దాం ఉగాది వీడియోలో ఈ మేరకు ఏమన్నా సమాచారం ఇస్తారేమో. ఆ వీడియో కానీ ఆకట్టుకుంటే సినిమాకు ఆగిపోయిన బిజినెస్‌ వెంటనే కిక్‌స్టార్ట్‌ అయిపోతుంది. ఇప్పుడు అంతా వశిష్ట చేతుల్లోనే ఉంది. ఏం చేసినా ఆయన బాధ్యతనే.

సినిమాగా మారబోతున్న 2015 చెన్నై వరదలు.. హీరో ఎవరో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus