నిజ జీవిత కథలను సినిమాగా తెరకెక్కిస్తే ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ అదిరిపోతోంది. ప్రకృతి విపత్తుల గురించి అయితే ఇంకా బాగా చూస్తున్నారు. వాటికి చిన్న సినిమాటిక్ టచ్ ఇచ్చి చేస్తుండటం ఆసక్తికరంగా చూస్తున్నారు మన సినిమా ప్రేక్షకులు. ఈ క్రమంలో మనకు బాగా పరిచయం ఉన్న ఓ ప్రకృతి విపత్తును ఇప్పుడు సినిమాగా మారబోతోంది. అదే 2015 తమిళనాడు వరదలు. ఆ ఏడాది నవంబరు 8 నుంచి – డిసెంబరు 14 వరకు ఈ విపత్తు నెలకొంది. ఈ పరిస్థితుల్ని ఇప్పుడు సినిమాగా తెరకెక్కిస్తున్నారట.
తమిళ నటుడు సూరి ఈ సినిమాలో కీలక పాత్రధారిగా నటిస్తారని సమాచాం. ‘అయలాన్’ సినిమా ఫేమ్ రవి కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఎమోషనల్ కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా సినిమాను ప్రకటిస్తారని సమాచారం. మరి జరిగిన నష్టాన్ని యథాతథంగా చూపిస్తారా? లేక సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఏదైనా కథను కలిపి చూపిస్తారా అనేది చూడాలి.
ఇక 2015 వరదల విషయానికొస్తే.. ఆ వరదల్లో 500 మందికిపైగా మృతి చెందారు. అందులో తమిళనాడుకు చెందిన వారు 422 మందికిగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారు 81 మంది ఉన్నారు. పుదుచ్చేరికి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. ఈ వరదల వల్ల తమిళనాడుకు అనధికారికంగా రూ.50 వేల కోట్ల నష్టం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు రూ.5000 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక పుదుచ్చేరికి రూ.300 కోట్ల నష్టం వాటిల్లింది అని సమాచారం.
ఇక సూరి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. ‘యలు కాదల్ ఎలు మలై’ ఒక సినిమా కాగా.. మరో సినిమా ‘మండాడి’. ఈ రెండూ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. ‘మండాడి’ సినిమాలో ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు సుహాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాలు విడుదల అవుతాయి.