ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. ఇవి వాళ్లకి సర్వసాధారణమే కానీ జనాలకి మంచి టైం పాస్ కాబట్టి ఇవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి. 2008లో ‘జానే తు యా జానే నా’ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టాడు ఇమ్రాన్ ఖాన్. అటు తర్వాత ‘కిడ్నాప్’ ‘ఢిల్లీ బెల్లీ’ ‘ఐ హేట్ లవ్ స్టోరీస్’ ‘గోరీ తేరే ప్యార్ మే’ వంటి వరుస చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యాడు.
2015లో వచ్చిన ‘కట్టి బట్టి’ చిత్రం తర్వాత ఇతను సినిమాలకి గుడ్ బై చెప్పేశాడు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్… అవంతికని 8 ఏళ్ళ పాటు ప్రేమించి డేటింగ్ చేసి 2011లో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకి ఇమారా అనే 7 ఏళ్ళ కూతురు కూడా ఉంది. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయట. ప్రస్తుతం వీళ్ళు విడిగా ఉంటున్నారు అని భోగట్టా. అంతేకాదు ఇప్పుడు లీగల్ గా విడిపోయి వీరి వివాహబంధానికి స్వస్తి చెప్పేయాలని చూస్తున్నారట.
అవంతిక కన్విన్స్ అయ్యి ఇమ్రాన్ తో కలిసి కాపురం చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఇమ్రాన్ మాత్రం అస్సలు తగ్గడం లేదట. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు ఎంత సర్ది చెప్పాలని ప్రయత్నించినా.. పెళ్లి అనేది తన జీవితంలో ముగిసిన అధ్యాయం అని అతను చెబుతున్నట్టు వినికిడి. ఇమ్రాన్ గురించి తెలిసిన అవంతిక..
అతని మనసు ఎలాగు మారదని ఫిక్స్ అయిపోయి.. విడాకులకు ఆమె కూడా సిద్దపడినట్టు తెలుస్తుంది. పెళ్ళికి ముందు లివింగ్ రిలేషన్ అంటూ విచ్చలవిడిగా తిరిగేసి పెళ్ళైన తర్వాత బాధ్యతలు అనే బరువులు మాత్రం మోయడానికి సినీ సెలబ్రిటీలు సిద్ధంగా లేరని ఈ జంట మరోసారి నిరూపించింది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!