Prabhas: ప్రభాస్ మూవీ నుంచి మరో ట్రీట్ సిద్ధమవుతోందా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ నుంచి ఇప్పటికే ఒక టీజర్ రిలీజ్ కాగా త్వరలో మరో టీజర్ రిలీజ్ కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రాగా అంచనాలను మరింత పెంచేలా తర్వాత టీజర్ ఉండనుందని సమాచారం. ఈసారి రిలీజయ్యే టీజర్ లో ప్రభాస్ తో పాటు పూజా హెగ్డే కూడా కనిపిస్తారేమో చూడాల్సి ఉంది.

యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా జస్టిస్ ప్రభాకరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. త్వరలో ఈ టీజర్ ట్రీట్ కు సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రను పోషిస్తుండగా పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రను పోషిస్తున్నారు. ప్రభాస్, పూజా హెగ్డే కెరీర్ లో ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి.

రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుంటోంది. దాదాపుగా 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది. గోల్డెన్ లెగ్ గా పేరును సొంతం చేసుకున్న పూజా హెగ్డే కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కానుంది. ప్రభాస్ రాధేశ్యామ్ మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకుంటారేమో చూడాల్సి ఉంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus