టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

ఎప్పుడూ హీరోయిన్ల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడి మాట్లాడి బోర్‌ కొట్టేసిందా. అయితే సరదాగా హీరోయిన్ల సంగతి కూడా చూద్దామా. మరీ హీరోలలాగా పదుల కోట్లు తీసుకోకపోయినా, వీళ్ల రెమ్యూనరేషన్లు కూడా కోట్ల రూపాయాల్లోనే ఉంటాయి. అలాంటి స్టార్‌ హీరోయిన్ల ఫిగర్సే ఇప్పుడు చూద్దాం. ఇందులో ఉన్నంత అమౌంటే తీసుకుంటారని మేం కచ్చితంగా చెప్పలేం కానీ, ఇంచుమించుగా అంతే ఉంటుందని మాత్రం చెప్పగలం.

* నయనతార

సౌత్‌ హీరోయిన్లలో సూపర్‌ స్టార్‌ అంటే… నయనతార అనే చెప్పాలి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రెస్‌ మారిన నాయికల్లో ఆమె ఒకరు. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేస్తోంది. ఒక్కో సినిమాకు సుమారు ₹నాలుగు కోట్ల నుండి ₹ ఆరు కోట్లు తీసుకుంటోంది.

* పూజా హెగ్డే

పాన్‌ ఇండియా హీరోయిన్‌ పూజా హెగ్డే కూడా భారీగా రెమ్యూనరేషన్‌ అందుకుంటోంది. ఈ పొడుగుకాళ్ల సుందరి సినిమాకు ₹మూడు కోట్లు నుండి ₹నాలుగు కోట్లు తీసుకుంటోందట. అయితే ఒక్కో వుడ్‌కి ఒక్కోలా ఉందట అమ్మడి వసూలు.

* రష్మిక మందన

నేషనల్‌ క్రష్‌గా అభిమానులు ముద్దుగా పిలుచుకుంటున్న రష్మిక మందన కూడా పెద్ద మొత్తంలోనే అందుకుంటోంది. తెలుగు, తమిళం, హిందీలో నటిస్తున్న రష్మికకు ఒక్కో సినిమాకు ₹ రెండున్నర కోట్ల నుండి ₹ మూడు కోట్ల వరకు ముట్టజెప్పుతున్నారట. ఈమె విషయంలో కూడా వుడ్‌కో రకం వసూలు ఉంటుందట.

* సమంత

విడాకులు తర్వాత సమంత జోరు పెరగింది. ఇన్నాళ్లూ అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన సమంత, ఇప్పుడు వరుసగా ఓకే చేసేస్తోంది. విజయదశమికి రెండు సినిమాలు అనౌన్స్‌మెంట్‌ వచ్చాయి. ఇప్పుడు సామ్‌కి ₹రెండు న్నర కోట్ల నుండి ₹మూడున్నర కోట్లు ఇస్తున్నారని టాక్‌.

* కీర్తి సురేశ్‌

విజయాలతో సంబంధం లేకుండా స్టార్‌డమ్‌ను అందుకున్న కథానాయిక కీర్తి సురేశ్‌. వరుస సినిమాలు చేస్తూ వస్తున్న కీర్తికి కూడా మంచి రెమ్యూనరేషనే అందుతోందట. తాజా లెక్కల ప్రకారం ఓ సినిమాకు ₹రెండు కోట్లకు డీల్‌ మాట్లాడుకుందట కీర్తి. కొన్ని సినిమాలకు ₹రెండున్నర కోట్లు కూడా తీసుకుందని టాక్‌.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus