టాలీవుడ్ లో మరో ప్రేమాయణం మొదలయింది. తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్ద కుటుంబానికి చెందిన హీరో కొంతకాలంగా చెన్నై బ్యూటీ తో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ప్రతి కార్యక్రమానికి కలిసి వెళ్లేవారు. అక్కడ తాగి నానా హడావుడి చేసేవారు. వారి వాలకం చూసి త్వరలో పెళ్లి వార్త చెబుతారని అనుకున్నారు. కానీ ఆ హీరోయిన్ మా మధ్య ప్రేమ లేదు, ఏమి లేదు అని ప్రకటించడంతో ఆ స్టోరీ అక్కడికి ఫుల్ స్టాప్ పడింది. ఈ ప్రేమ కథలో హీరో, హీరోయిన్ ఎవరో మీకు అర్ధం అయింది కదా. ఇప్పుడు ఆ పొడుగు హీరో మాత్రం తన ప్రేమ కథను అంతటితో ఆపలేదు. మరో హీరోయిన్ తో జతకలిశారు.
టాలీవుడ్ లో వరుసగా విజయాలు అందుకుంటున్న ఈ భామ అతనితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఆమెకు అవకాశాలు రావడానికి కూడా ఈ బ్యాచిలర్ సహాయం చేస్తున్నారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఈ కృతజ్ఞతతోనే ఆ బ్యూటీ, హీరోకి మనసు ఇచ్చినట్లు అనుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి ముంబయి, దుబాయ్ అంటూ విహరిస్తున్నారని, చుట్టుపక్కల వారిని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రేమ పక్షులు లేరని ఆ జంటను చూసిన వారు వెల్లడిస్తున్నారు. ఈ ప్రేమ వరకు వెళుతుందో .. చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.