నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘మజ్ను’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమయ్యింది అనూ ఇమ్మాన్యుయల్. తన సహజమైన నటనతో, గ్లామర్ తో యువతను బాగా ఆకట్టుకుంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకోవడంతో, పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’, అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ వంటి పెద్ద అవకాశాలు దక్కించుకుంది.ఆ సినిమాలు డిజాస్టర్లు గా మిగిలాయి. ఇక చైతూతో చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ కూడా యావరేజ్ గానే నిలిచింది. దీంతో అనూ ఇమ్మాన్యుయల్ కు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
ఇక ఈ విషయం పై తాజా ఆమె స్పందించింది. మార్చి 28 న ఆమె పుట్టిన రోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. ఇక ఇందులో భాగంగా అనూ ఇమ్మాన్యుయల్ “కెరియర్ తొలినాళ్ళలో వరుసగా గ్లామరస్ పాత్రలను చేస్తూ వెళ్ళాను. అదే సమయంలో నాకు అంతగా ప్రాధాన్యత లేని పాత్రలు కూడా చేసేశాను. ఈ కారణంగానే నేను వెనకబడిపోయాను. ఇక పై కథల విషయంలో .. ముఖ్యంగా నా పాత్రల విషయంలో జాగ్రత్తగా ఉంటాను. గ్లామర్ తోపాటు నటనకి ప్రాధాన్యత ఉంటే పాత్రల్ని మాత్రమే చేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది.