Anupama: ఆగని అనుపమ విమర్శలు.. మగాళ్లు కూడా చిరాకు పడేలా ‘అతని’ చేష్టలు
- August 19, 2026 / 11:52 AM ISTByFilmy Focus Desk
తానో అపరిచితుడుని ప్రేమించాను అంటూ.. సౌత్ సినిమా పరిశ్రమను ఓ కుదుపు కుదిపిన ప్రముఖ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ నుండి మరో కుదుపు వచ్చేసింది. ఏ ఇంటర్వ్యూలో అయితే తాను మొదట విమర్శలు స్టార్ట్ చేసిందో, అదే ఇంటర్వ్యూ రెండో పార్టు వచ్చింది. ఇందులో ఆమె విమర్శలు మరింత పదునెక్కాయి. మగాళ్లు కూడా చిరాకు పడేలా ఆ చేష్టలు ఉన్నాయి అనిపించేలా ఉన్నాయి అనుపమ చెప్పే మాటలు. దీంతో మరోసారి ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Anupama
నేను ఓ నటినైనందుకు, అందులోనూ ధైర్యంగా ఉన్నందుకు, ప్రతి నెలా పీరియడ్స్ వచ్చే ఒక మహిళనైనందుకు సిగ్గుపడే పరిస్థితిలోకి అతను నన్ను నెట్టేశాడు. నేను ఏ రోజైనా తన దగ్గరకు వెళ్లి తన తప్పులను ప్రశ్నిస్తే ఎప్పుడూ ఒక్కటే మాట అనేవాడు. ఓహో.. నీ పీరియడ్స్ టైమ్ కదా. అవును ఇంకా రాలేదా.. మూడ్ స్వింగ్స్ కదా అని వెటకారంగా అనేవాడు. ఆ మాటలతో ఒక్కోసారి నాపై నాకే అసహ్యం వేసింది అంటూ తన పరస్థితిని వివరించిది అనుపమ.
ఒకప్పుడు నాకు 11 మంది పిల్లలు కావాలని కలలు కనేదాన్ని. కానీ పిల్లలే వద్దు అనే స్థాయికి ఇప్పుడు వచ్చేశాను. ఒక మహిళగా పుట్టినందుకే కదా ఇలాంటి మాటలు అనిపించేది అని అనుపమ గతాన్ని గుర్తు చేసుకుంది. దీంతో మనుషులు ఇలా కూడా ఉంటారా అనే డౌట్ వచ్చేలా మారింది. సుమారు రెండేళ్ల పాటు అలాంటి వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నానని.. ఆ బంధం కారణంగా తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పింది. క్యారవాన్‌లోకి వెళ్లి ఒంటరిగా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని అనుపమ చెప్పింది.
ఆఖరికి సొంత తమ్ముడితో చనువుగా ఉండడానికి కూడా అతని వల్ల భయపడ్డాను అని చెప్పింది. అయితే ఇప్పటికీ ఆమె ఆ మాజీ బాయ్ ఫ్రెండ్ పేరును ప్రస్తావించలేదు. మరోవైపు తన బ్రేకప్ గురించి బాధపడుతున్నట్లు ధ్రువ్ విక్రమ్ చెప్పాడు. అయితే ఎవరితో బ్రేకప్ అయింది అనేది ఆయన చెప్పలేదు.













