అనుపమ పరమేశ్వరన్ ని చూసిన ప్రతి ఒక్కరూ తెలుగు అమ్మాయి అనుకుంటారు. అలా ఏ భాషలో నటిస్తే ఆ భాష అమ్మాయిగా కనిపించడం అనుపమకు నటనతో పెట్టిన విద్య. మలయాళ కుట్టి అయిన ఈ బ్యూటీ అ..ఆ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత తనకి మలయాళంలో పేరు తెచ్చిన రోల్ ని మరో సారి తెలుగు ప్రేమమ్ లో చేసి ఆకట్టుకుంది. శతమానం భవతి చిత్రంతోను అందరి మెప్పు అందుకుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఉన్నది ఒకటే జిందగీ” మూవీలో ఉత్తమ నటన ప్రదర్శించింది. మంచి పాత్రలతో తెలుగు ఫిలిం మేకర్స్ దృష్టిలో పడుతున్న ఈ భామ ఓ భారీ ఛాన్స్ ని వదులుకుందంట.
స్టార్ డైరక్టర్ పిలిచి అవకాశం ఇచ్చినా ఎందుకు వద్దంది? అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఆ పాత్ర చివర్లో చనిపోతుందంట.. అందుకే ఆ రోల్ కి నో చెప్పిందని సమాచారం. ఉన్నది ఒకటే జిందగీ లోను ఇలాంటి పాత్రే.. సో మళ్ళీ అటువంటి పాత్ర చేస్తే .. విషాదాంతం కలిగిన క్యారెక్టర్స్ అన్నీ తనకే వస్తుందని బయపడి పెద్ద చిత్రం అయినప్పటికీ వదులుందని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. తనకి ఇంకా డిఫెరెంట్ రోల్స్ చేయాలనీ ఉందని చెప్పింది.