అసలు అతడెవరో కూడా తెలియదు, అలాంటిది ప్రేమ ఏంటీ: అనుపమ

హీరోయిన్స్ కి క్రికెటర్స్ కి ఎందుకు కుదిరిందో తెలియదు కానీ.. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఒక ఓపెన్ సీక్రెట్ లాంటిది. ధోనీ-దీపిక పడుకొనే, యువరాజ్-కిమ్ శర్మా, గంగూలీ-నగ్మా ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్ చాలా పెద్దది. ఈ లిస్ట్ లో కొద్దిగుంటే మన మలయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా చేరిపోయేది. అందుకు కారణం లేకపోలేదు లెండి.. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ మ్యాచుల్లో తన బౌలింగ్ తో భీభత్సమైన పేరు, ఇమేజ్ సంపాదించుకొన్న బుమ్రా సోషల్ మీడియాలో అనుపమ పరమేశ్వరన్ ను ఫాలో అవ్వడం, అనుపమ కూడా అతడ్నిఫాలో అవ్వడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.

అయితే.. ఇటీవల ఈ విషయమై స్పందించిన అనుపమ పరమేశ్వరన్.. అతను ఒక క్రికెటర్ అనే విషయం తప్పితే, అతను ఎవరు అనే విషయం కూడా నాకు తెలియదు. అలాంటిది మీడియాలో నేను బుమ్రాను ప్రేమిస్తున్నాను అని వచ్చిన వార్తల్లో నిజం ఎలా ఉంటుంది. అవన్నీ ట్రాష్ అని తేల్చి పడేసింది. ఇదివరకు కూడా బుమ్రా బొద్దుగుమ్మ రాశీఖన్నాతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడనే కథనాలు వెలువడ్డాయి. అప్పుడు కూడా రాశీ స్వయంగా ఆ వార్తల్ని కొట్టిపడేసింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus