సోషల్ మీడియలో అనుపమ పరమేశ్వరన్ భలే యాక్టివ్‌గా ఉంటుంది. కొత్త కొత్త ఫొటో షూట్లు, వీడియోలతో సందడి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి రామ్ పోతినేని అభిమానులు తెగ ఆనందపడుతున్నారు. ఇందులో రామ్ అభిమానుల ఆనందం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఆ వీడియోలో కనిపించింది రామ్ కాబట్టి. రామ్ – లింగుస్వామి కాంబినేషన్లో ‘వారియర్’ అనే సినిమా షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా సెట్‌కి ఇటీవల అనుపమ పరమేశ్వరన్ వెళ్లిందట. అయితే సాధారణంగా వెళ్లకుండా మొబైల్లో కెమెరా ఆన్ చేసుకుని, రామ్‌ని పలకరించింది. తనను చూస్తే రామ్ ఎలా రియాక్ట్ అయ్యాడు అనేది చూపించడం ఆమె ఉద్దేశం. ఆమె అనుకున్నట్లే రామ్ చాలా హైలో రియాక్ట్ అయ్యాడు. ‘హలో అండీ..’ అంటూ రామ్‌ని అనుపమ పలకరించింది. అది చూసి రామ్ ‘ఓయ్’ అంటూ హుషారుగా రియాక్ట్ అయ్యాడు. ఈ మొత్తం సీన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది అనుపమ పరమేశ్వరన్.
అయితే రామ్ పోతినేని అలా చూపించింది అనేమో… ఆఖరున వీడియోలో సారీ అని కూడా రాసుకొచ్చింది. ఆ తర్వాత రాపో అంటూ ఓ లవ్ సింబల్ కూడా పెట్టింది. దీంతో చాలా రోజులుగా వస్తున్న పుకార్లకు చెక్ పడింది అని చెప్పొచ్చు. ఆ మధ్య ఓ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో అనుపమ మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో ఓ హీరోను చాలా ప్రేమించానని, అయితే ఆ తర్వాత విడిపోయామని చెప్పుకొచ్చింది. దీంతో ఆ హీరో రామ్ పోతినేని అంటూ మీడియాలో వార్తలొచ్చాయి.
ఇప్పుడు ఇలా అనుపమ వీడియో షేర్ చేయడం, కూల్ కామెంట్ రాయడంతో.. అవన్నీ పుకార్లే అని చెప్పకనే చెప్పినట్లయ్యింది. కొందరేమో అనుపమ కోపం తగ్గిందా అని అంటుంటే.. కొందరేమో అవన్నీ పుకార్లు అని చెప్పడానికే ఈ పోస్ట్ అని రాసుకొస్తున్నారు. ఏదైతేముంది టాలీవుడ్లో క్యూట్ ఆన్ స్క్రీన్ పెయిన్ ఈజ్ బ్యాక్. అయితే ఈ వీడియలో అనుపమ కనిపించకపోవడం ఒక్కటే లోటు.