స్వీటి కష్టాలు చూడండయ్యా!

  • June 30, 2016 / 10:21 AM IST

ఇటీవల ఫిలిమ్ ఫేర్ అవార్డ్ వేడుకలో అనుష్కను చూసివారందరూ నోరెళ్ళబెట్టారు. అలా చేయడానికి కారణం ఆమె అందం అనుకొంటే తప్పుకో కాలేసినట్లే, ఆమె భారీతనం చూసి బెదిరిపోయారు అందరూ. అదేంటి అప్పట్లో సన్నబడింది అన్నారు కదా అని తమను తాము ప్రశ్నించుకొన్నారు కూడా. చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా అనుష్కను అనుకోని ఆ తర్వాత ఆమెను కాదనడానికి కారణం కూడా ఆమెచ్చు చూడగానే తెలిసిపోయిందండరికీ.

అయితే.. అనుష్క ఇప్పుడు ఉన్నపళంగా లావు తగ్గాలంటే “లైపో” ఒక్కటే గతి. కానీ, అనుష్కకు అలా తగ్గడం ఏమాత్రం ఇష్టం లేదు, అందుకే యోగాతోపాటు ఎక్సర్ సైజులు చేస్తూనే మెడికేషన్ సుకొంటోందట. “బాహుబలి 2” షూటింగ్ శరవేగంగా జరుగుతుండడం, “దేవసేన” క్యారెక్టర్ లో కనబడాలంటే స్వీటీ అర్జెంటుగా బరువు టాగ్గాలని రాజమౌళి చెప్పాడట. దాంతో ఏం చేయాలో పాలుపోక మిన్నౌండిపోయింది స్వీటీ!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus