ఆ వార్తలు రాస్తే ఊరుకునేది లేదన్న అనుష్క

  • June 6, 2017 / 01:49 PM IST

యాక్షన్ బేస్డ్ సినిమాల్లో లీడ్ రోల్ పోషిస్తున్నప్పటికీ బయట అనుష్క చాలా స్వీట్ గానే ఉంటుంది. ఎప్పుడూ కూల్ గానే మాట్లాడుతుంటుంది. తనపై వచ్చిన రూమర్లకు సున్నతంగా సమాధానాలు ఇచ్చేది. తొలిసారిగా అనుష్కకు కోపం వచ్చింది. అందుకు కారణం రూమర్స్ క్రియేట్స్ చేసేవాళ్ళే. ఇదివరకు తనపై వచ్చిన గాసిస్ కి హద్దు ఉండేదని, ఇప్పుడు అది శృతి మించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాహుబలి 2 చిత్రం తరువాత మరీ ఎక్కువయ్యాయని చెప్పింది. ఈ మధ్య అనుష్క, ప్రభాస్ ప్రేమించుకున్నారని, ప్రభాస్‌ ఇంట్లో అనుష్కను కోడలిగా అంగీకరించడం లేదన్నవార్తలు జోరు అందుకున్నాయి.

ఈ వార్తలకు చెక్ చెప్పాలని ఈ రోజు అనుష్క మీడియా ముందుకు వచ్చింది. ‘నేను, ప్రభాస్‌ హిట్‌ ఫెయిర్‌. అయితే పర్సనల్‌గా మా మధ్య ఉన్నది స్నేహమే. అంతేకానీ లేని పోనీవి కల్పించి ప్రచారం చేయిస్తే  చట్టప్రకారం చర్యలు తీసుకుంటాను’ అని హెచ్చరించింది. స్వీటీ ఇంత ఘాటుగా హెచ్చరించడంతో గాసిప్స్ ప్రవాహం తగ్గవచ్చని అందరూ అనుకుంటున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus