యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజుని అభిమానులు పండుగలా చేసుకుంటున్నారు. మిత్రులు, తోటి నటీ నటులు సోషల్ మీడియా వేదికపై శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే బర్త్ డే బాబుకు గర్ల్ ఫ్రెండ్ అనుష్క ప్రత్యేక బహుమతి ఇచ్చిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఒక డిజైనర్ వాచీని ప్రభాస్ కి గిఫ్ట్ గా పంపి ఆశ్చర్యానికి గురిచేసిందని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అందుకే అతడికి డిజైనర్ చేతిగడియారాన్ని బహుమతిగా ఇచ్చిందని సమాచారం.
బిల్లా, మిర్చి, బాహుబలి 1, 2 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. టాలీవుడ్ హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. బాహుబలి తర్వాత వీరిద్దరూ కలిసి జీవిస్తున్నారని వార్తలు షికారు చేశాయి. దీంతో స్నేహితులైన అనుష్క, ప్రభాస్ లు కలిసి నటించడానికి వెనుకాడారు. ప్రస్తుతం ప్రభాస్ “సాహో” సినిమాతో, అనుష్క “భాగమతి” సినిమాతో బిజీగా ఉన్నారు.