టాలీవుడ్ జేజెమ్మ అనుష్క త్వరలో పెళ్లి చేసుకోనుందా?, సినిమాలకు గుడ్ బై చెప్పనుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ కోసం శ్రమిస్తున్న స్వీటీ, దీని తర్వాత భాగమతి మూవీలో నటించనుంది. ఆ తర్వాత అనుష్క ఏ సినిమాకు సైన్ చేయకపోవడంతో పెళ్లి చేసుకుంటుందన్న వార్తలు నిజమేమనని అందరూ భావిస్తున్నారు. బెంగుళూరులోని అనుష్క కుటుంబానికి చెందిన అత్యంత సన్నిహితులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
స్వీటీ టాలీవుడ్ లో ఎవరిని ప్రేమించలేదని, అసలు సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిని తాను వివాహం చేసుకోనని ఆమె తల్లిదండ్రులకు ఏడాది క్రితమే చెప్పిందంట. అప్పటి నుంచే ఈ అరుంధతికి తగ్గ వరుడిని పేరెంట్స్ వెతికారని, బెంగళూర్ లో బిజినెస్ మ్యాన్ ని సెలక్ట్ చేశారని తెలిసింది. అతన్నే పెళ్లి చేసుకుంటానని రీసెంట్ గా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. పెళ్లి అయిన తర్వాత సూపర్ భామ సినిమాలకు గుడ్ బై చెప్పడం కూడా ఖాయమని బెంగళూర్ వాసులు స్పష్టం చేశారు. అందుకే బాగమతి తర్వాత ఏ భాషలోనూ కొత్త మూవీకి సైన్ చేయడం లేదని వెల్లడించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.