బాలీవుడ్ నటి అనుష్క శర్మ గురించి పరిచయం అవసరం లేదు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రేమలో పడ్డారు. ఇలా విరాట్ కోహ్లీ ప్రేమలో పడినటువంటి అనుష్క శర్మ ఎంతో ఘనంగా తనను వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ దంపతులు ఒక కూతురికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో మొదటి టీ20 మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ జట్టుతో కలిసి శనివారం మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియానికి చేరుకున్నారు.
అనుష్క తాను నటిస్తున్నటువంటి ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ షూటింగ్లో పనులలో భాగంగా లండన్ లో ఉన్నారు. ఈ విధంగా కోహ్లీ ఆస్ట్రేలియాలో,అనుష్క శర్మ లండన్ లో ఉండటం వల్ల ఈమె తన భర్తను చాలా మిస్ అవుతున్నాను అంటూ తనతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనుష్క శర్మ స్పందిస్తూ నా భర్తను చాలా మిస్ అవుతున్నాను.
ఈ ప్రపంచం మొత్తం ఎంతో అందంగా ఉన్న నాలో ఏదో తెలియని వెలితి ఉంది. నా హబ్బీని మిస్ అవుతున్నానని ఫీలింగ్ నాలో కలిగింది అంటూ ఈమె పోస్ట్ చేశారు. ఈ విధంగా విరాట్ కోహ్లీని చాలా మిస్ అవుతున్నానంటూ ఈమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ ఈ పోస్ట్ పై స్పందిస్తూ రెడ్ హార్ట్ సింబల్ షేర్ చేశారు.ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో
ఎంతో మంది అభిమానులు వీరి మధ్య ఉన్న ప్రేమను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.విరాట్ కోహ్లీ ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో భారత్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అఫ్గానిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా సెంచరీతో తిరిగి ఫామ్ లోకి వచ్చారు.