బాలీవుడ్ సీనియర్ నటి, ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సతీమణిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనుష్క శర్మ గురించి అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన నటిగా గుర్తింపు పొందిన అనుష్క శర్మ విరాట్ కోహ్లీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లి తర్వాత కూడా పలు సినిమాలలో నటించిన అనుష్క శర్మ కూతురు జన్మించిన తర్వాత కాస్త సినిమాలను తగ్గించారు. ఇలా తన కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితమైన ఈమె నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు.
అయితే నిర్మాణ బాధ్యతలు చేపట్టాలంటే ఎంతో కష్టమైన పని అని తాను నిర్మాణ రంగం నుంచి కూడా తప్పుకుంటానని అనుష్క గతంలో వెల్లడించారు. అయితే ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ప్రకటించిన ఈమె తన భర్త కూతురుతో కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని గడుపుతున్నారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి తన భర్త కూతురుతో కలిసి మాల్దీవుల వెకేషన్ లో ఎంజాయ్ చేసిన అనుష్క సోమవారం ముంబై చేరుకున్నారు.
మధ్యాహ్నం ముంబై ఎయిర్ పోర్టులో సందడి చేసిన ఈమె అదే రోజు సాయంత్రం తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి హడావిడిగా హాస్పిటల్ కి వెళ్లడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ జంట సోమవారం సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద కనిపించారు.ఈ విధంగా వీరిద్దరూ హాస్పిటల్ వద్ద హడావిడిగా కనిపించడంతో ప్రస్తుతం నెటిజన్లు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు.
ఇంత హడావిడిగా ఈ జంట హాస్పిటల్ కి వెళ్లడానికి కారణం ఏమిటి? త్వరలోనే అనుష్క గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా.. ఈమె మరీ తల్లి కాబోతున్నారా? అంటూ పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి ఈ జంట ఇద్దరూ కలిసి ఇలా హాస్పిటల్ కి వెళ్లడంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈమె ఎందుకు హాస్పిటల్ కి వెళ్లారనే విషయం తెలియకపోయినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గురించి వైరల్ అవుతుంది.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!