స్వీటీ అనుష్క తన అందం, అభినయం తో ఎంతోమంది మనసులు దోచుకుంది. ఈమె అంటే చాలామందికి పిచ్చి. తెలుగులోనే కాదు దక్షిణాది అన్ని పరిశ్రమలో టాప్ హీరోయిన్ జాబితాలో స్థానం సంపాదించిందంటే అనుష్క క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. అలాంటి అనుష్కకు ఓ క్రికెటర్ అంటే చాలా అభిమానం. కాదు ప్రేమ. కాదు కాదు పిచ్చి. అవును ఇది నిజం. ఆమె స్వయంగా ఈ విషయాన్నీ వెల్లడించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో అనుష్క మాట్లాడుతూ “నేను రాహుల్ ద్రవిడ్‌కు వీరాభిమానిని.
అతనంటే చిన్నప్పట్నుంచీ నాకు పిచ్చి. ఒకానొక సమయంలో ద్రవిడ్‌తో పీకల్లోతు ప్రేమలో పడిపోయాను” అని అనుష్క చెప్పింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. అనుష్క బాహుబలి చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ భాగమతి కోసం కొన్ని నెలలలుగా కష్టపడుతోంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గతవారం రిలీజ్ అయి సినిమాపై అంచనాలను పెంచేసింది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.