“బాహుబలి, ఎంతవాడుగానీ, సైజ్ జీరో” చిత్రాల కోసం సినిమాకో అయిదు కేజీల చొప్పున బరువు పెరుగుతూ పోయిన అనుష్క ఇప్పుడు ఆ కొవ్వును కరిగించే పనిలో ఉన్న విషయం తెలిసిందే. “బాహుబలి 2″తోపాటు “భాగమతి” అనే ఓ సోషల్ థ్రిల్లర్ లోనూ అనుష్క నటించనుంది.
ఈ సినిమాల కోసం అనుష్క తనకు తెలిసిన యోగాతోపాటు రకరకాల ఎక్సర్ సైజులు గట్రా చేస్తూ ఇప్పటికే దాదాపు 10 కేజీలు తగ్గింది. అయితే.. దర్శకుడు అశోక్ ఇంకాస్త బరువు తగ్గాలని సూచించడంతో.. అమ్మడు మరో 8 కేజీలు తగ్గిందట. మొత్తంగా 18 కేజీలు తగ్గిన అనుష్క చూసినవారందరూ “అనుష్క బ్యాక్ టు ఫాం” అంటూ కితాబులిచ్చేస్తున్నారంట. మరి మనకు సన్నబడ్డ సన్నజాజి దర్శనం ఎప్పుడవుతుందో!!