చిరు పక్కన కత్తిల్లాంటి ఫిగర్

Advertisement

“ఐ వన్నాసూపర్ మాన్.. ఐ వన్నా స్పైడర్ మాన్.. నాకే కావాలి దాసోహం..” అని స్టాలిన్ సినిమాలో పాడిన అనుష్క చిరుని ఏకంగా దాసోహం చేసుకున్నట్లుంది. మెగాస్టార్ 150 వ సినిమా “కత్తిలాంటోడు” కోసం హీరోయిన్ అన్యేషణ పూర్తి అయ్యింది. కత్తిలాంటోడు పక్కన కత్తి లాంటి ఫిగర్ అనుష్కనే ఎంపిక చేశారు.

వీ వీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మొదట నయనతారను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. ఆమె తమిళ్ చిత్రాల్లో బిజీగా ఉండడంతో “బాబు బంగారం” చిత్రం షూటింగ్ కూడా సరిగ్గా రావడం లేదని తెలియడంతో.. ఈ అవకాశం అనుష్కకు వరించింది. హైట్, వెయిట్ లో చిరుకి అనుష్క సరిజోడి. అంతే కాకుండా డాన్సు లోనూ పోటీ పడగల సత్తా ఆమెకు ఉందని, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగుంటుంది అని చిత్ర బృందం స్వీటీ కే ఓటు వేసినట్లు తెలిసింది.

స్వీటి అనుష్క ప్రస్తుతం బాహుబలి కంక్లూజన్ చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే కత్తిలాంటోడు రెగ్యులర్ షూటింగ్ లో ఆమె పాల్గొంటారని యూనిట్ వర్గాలు తెలిపాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news