‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే సినిమాల్లోనూ భయం లేదు.. రాజకీయాల్లోనూ భయం లేదు’ అన్నారు ఏపి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని. బహుశా అది అతని అభిప్రాయం అనుకుంట. కానీ అక్కడి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం పవన్ కళ్యాణ్ అన్నా… ‘జనసేన’ పార్టీ అన్నా చాలా భయం అని ఈరోజు బలంగా నిరూపించబడింది. ‘భీమ్లా నాయక్’ చిత్రం కలెక్షన్లను దెబ్బతీయడానికి ఏపి ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.3 కోట్లు ఖర్చు పెట్టిందట.
ఎమ్మార్వో వంటి వారిని అక్కడ థియేటర్ల వద్ద కాపలా పేంటించడం, సి.ఆర్.పి.ఎఫ్ సిబ్బందిని ప్రతీ థియేటర్ వద్ద పెట్టించడం… వాళ్లకి టిఫిన్లు, టీలు, భోజనాలు వగైరా మొత్తం ఏపిలో అన్ని థియేటర్ల వద్ద ఏర్పాట్లు చేయించడంతో వీటి ఖర్చు అక్షరాలా రూ.3 కోట్లు దాటిందని వినికిడి. ‘భీమ్లా నాయక్’ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేవరకు ఇదే ప్రొసీజర్ ఫాలో కావాలని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఒక సినిమా కలెక్షన్లు ఆపడానికి.. ఓ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తుండడం అంటే చరిత్రలో నిలిచిపోయే అంశమే.
అయితే ఇవన్నీ ఎంత చేసినా ‘భీమ్లా నాయక్’ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ ను ఈ రేంజ్ మాస్ యాంగిల్ లో చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టికెట్ రేట్లతో సంబంధం లేకుండా చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ చూడాలని థియేటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ‘అఖండ’ ‘పుష్ప’ వంటి సినిమాలకి రూ.100, ‘బంగార్రాజు’ కి రూ.200 టికెట్ రేట్లు అమ్ముకున్నా మాట్లాడని ప్రభుత్వం ఇప్పుడు పనిగట్టుకుని రద్దైన జీవో నెంబర్ 35 ని అమలు చేయడంతో కొన్ని చోట్ల థియేటర్లను మూసేసింది సిబ్బంది.
దీంతో చాలా చోట్ల షోలు నిలిచిపోయాయి. అయితే మరికొన్ని చోట్ల వై.సి.పి సిబ్బందే తమ కార్యకర్తలతో గేట్ల వద్ద రూ.500, రూ.1000 కి టికెట్లు అమ్ముకుంటూ ఆ డబ్బుల్ని తమ పాకెట్లో వేసుకుంటున్నారు.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!