గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తరహాలో బిగ్‌బాస్‌లో కొత్తగా రికార్డులను తీసుకొచ్చారు. హౌస్‌మేట్స్‌తో గేమ్స్ ఆడించి… రికార్డులు నెలకొల్పించారు నాగ్. మరి ఈ వారం ఎవరెవరు ఏ గేమ్ ఆడారు.. ఏ రికార్డు నెలకొల్పారో చూద్దాం. చెరో 50 బెలూన్లను ఇచ్చి వీలైనంత త్వరగా పగలకొట్టమని అభిజీత్, అమ్మ రాజశేఖర్‌కు టాస్క్ ఇచ్చారు. అయితే చేతితో కాకుండా… బ్యాక్‌తో బద్ధలు కొట్టమన్నారు. అలా మాస్టర్ 86 సెకన్లలో 50 బెలూన్లు బద్దలుకొట్టి రికార్డు సాధించాడు.
టాయిలెట్ పేపర్ బండిల్‌తో టవర్ నిర్మించమని దేవీ నాగవల్లి, లాస్యకు చెబితే ఇద్దరూ చేయలేకపోయారు. ఆఖరికి కలసి కూడా చేయలేకపోయారు. నోటిలో ఎవరెక్కువ స్ట్రాలు పెట్టుకుంటారనే టాస్క్‌లో కుమార్‌సాయి గెలిచాడు. 80కిపైగా స్ట్రాలు పెట్టుకొని సోహైల్ మీద విజయం సాధించి రికార్డు కొట్టేశాడు ఒక నిమిషంలో కాలికి ఎవరు ఎక్కువ సాక్సులు తొడుగుతారనే రికార్డును స్వాతి దీక్షిత్ సంపాదించింది. హారికతో జరగిన పోటీలో 15-14 తేడాతో గెలుపొందింది. మెహబూబ్‌కు వంద బాగా అచ్చొచ్చినట్లుంది.
అఖిల్‌తో జరిగిన స్కిప్పింగ్ పోటీలో నిమిషయంలో 100 స్కిప్‌లు చేసి గెలిచాడు.. రికార్డు కొట్టేశాడు. అవినాష్ – సుజాత మధ్య తిండి పోటీ జరిగింది. నిమిషయంలో ఎన్ని బ్రెడ్లు తింటారనే ఈ రికార్డును అవినాష్ దిగ్విజయంగా గెలిచేశాడు. యాపిల్‌ను స్పీడ్‌గా తిని మోనాల్ మీద దివి రికార్డు కొట్టేసింది.