Ardhamaindha Arun Kumar Review in Telugu: అర్థమైందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • June 30, 2023 / 07:13 PM IST

Cast & Crew

  • హర్షిత్ రెడ్డి (Hero)
  • అనన్య,వాసు ఇంటూరి (Heroine)
  • జై ప్రవీణ్, తేజస్వి మాదివాడ తదితరులు (Cast)
  • జోనాథన్ ఎడ్వర్డ్స్! (Director)
  • బి.సాయి కుమార్, నియతి మర్చంట్, శరణ్ సాయికుమార్, అర్చన కరుల్కర్, తన్వి దేశాయ్ (Producer)
  • అజయ్ అరసాడ (Music)
  • అమర్ దీప్ (Cinematography)

ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల హవా పెరిగింది. బాలీవుడ్లో మాత్రమే కాదు ఇప్పుడు టాలీవుడ్లో కూడా క్రేజీ వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. అలా అని అన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయా అంటే అలాంటిదేమీ లేదు. తాజాగా ఓ కొత్త వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘అర్థమైందా అరుణ్ కుమార్’ పేరుతో వచ్చిన ఈ వెబ్ సిరీస్.. హిందీలో వచ్చిన ‘అఫీషియల్ చౌక్యాగిరి’ వెబ్ సిరీస్ స్ఫూర్తితో రూపొందింది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : జీవితంలో ఏదో సాధించాలి.. అందుకు సాఫ్ట్ వేర్ ప్రపంచమే దిక్కు అని భావించి అమలాపురం నుండి హైదరాబాద్ కి వస్తాడు అరుణ్ కుమార్ ముందా (హర్షిత్ రెడ్డి). ఈ క్రమంలో ఓ సాఫ్ట్ వేర్ ఆఫీసులో ఇంటర్న్ కింద జాయిన్ అవుతాడు. అక్కడ ఇతను చేసే పని… కాదు కాదు పనులు ఏంటంటే.. బాస్ కాఫీలు పెట్టమంటే పెట్టడం, ఓ సీనియర్ చెప్పాడని కుక్కను తిప్పడం వంటివి.

అలా ఇతన్ని ఇంటర్న్ గా కాకుండా పనోడుగా చుస్తూండటంతో పల్లవి (30 వెడ్స్ 21 ఫేమ్ అనన్య) అతనితో నవ్వుతూ మాట్లాడటం మొదలు పెడుతుంది.దీంతో అంతా బాగానే ఉందని అరుణ్ సంతోషించే లోపు మధ్యలో షాలిని (తేజస్వి మాదివాడ) వస్తుంది? ఆ తర్వాత అరుణ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మిగిలిన ఎపిసోడ్స్ కి సంబంధించిన కథ.

నటీనటుల పనితీరు : హర్షిత్ రెడ్డి బాగానే నటించాడు. ఇతని పాత్ర సహజత్వానికి దగ్గరగా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ’30 వెడ్స్ 21′ ఫేమ్ అనన్య తన నటనతో మరోసారి ఆకట్టుకుందని చెప్పవచ్చు.తేజస్వి కూడా ఈ సిరీస్ లో అందరికీ తెలిసిన మొహాల్లో ఒకరు. ఆమె కూడా బాగానే నటించింది.ఆమె నుండీ ఆశించే బోల్డ్ సన్నివేశాలు కూడా ఇందులో ఉన్నాయి.ఇక వాసు ఇంటూరి, జై ప్రవీణ్ వంటి వారు బాగానే చేశారు. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : కార్పొరేట్ కంపెనీల్లో ఎలాంటి హడావుడి ఉంటుందో చాలా షార్ట్ ఫిలిమ్స్ లో, వెబ్ సిరీస్లలో చూపించారు. వర్క్ టెన్షన్ లు, టార్గెట్లు, ఇంగ్లీష్ లో వాగే టీం లీడ్లు, మేనేజర్ లు, స్మోకింగ్ ఎక్కువగా చేసే అమ్మాయిలు.. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇందులో కూడా అలాంటి గోల ఉంది. కానీ వాటిని కొన్ని చోట్ల పాజిటివ్ గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు జోనాథన్ ఎడ్వర్డ్స్.

అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ బాగానే ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కూడా నార్మల్ వెబ్ సిరీస్లలో ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి తప్ప అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

విశ్లేషణ : ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ ను ‘ప్రతి ఒక్క ఇంటర్న్ కథ’ అంటూ ప్రమోట్ చేశారు. కానీ అది కూడా సగమే అనిపిస్తుంది. మిగిలినదంతా మనం ఎప్పుడూ చూసే వెబ్ సిరీస్ ల మాదిరిగానే సాగింది అనిపిస్తుంది. 5 ఎపిసోడ్స్ ల ఈ వెబ్ సిరీస్ ను మీకు టైం ఉంటే చూడొచ్చు. కానీ ఖాళీ చేసుకుని చూడాల్సిన సిరీస్ అయితే కాదు.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus