Ariyana, RGV: బోల్డ్ ఇంటర్వ్యూపై స్పందించిన బిగ్ బాస్ బ్యూటీ!

  • June 25, 2021 / 10:59 AM IST

గతంలో రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అయిన అరియనా.. ఆ తరువాత బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. తన ముక్కుసూటితనంతో అభిమానులను సొంతం చేసుకుంది. తాజాగా ఈ బ్యూటీ మరోసారి ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ప్రోమోలను, పోస్టర్లను విడుదల చేస్తూ ఓ రేంజ్ హైప్ తీసుకొచ్చారు వర్మ. రీసెంట్ గా పూర్తి స్థాయి ఇంటర్వ్యూను విడుదల చేయగా.. ప్రేక్షకుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా ఈ బోల్డ్ ఇంటర్వ్యూపై స్పందించింది అరియానా. ఆర్జీవీతో అంతసేపు ఇంటర్వ్యూ చేయడమే ఓ పెద్ద టాస్క్ అని.. నాకు ఇది ప్లస్ అవుతుందేమో కానీ ఆయనకు మామూలే అంటూ చెప్పుకొచ్చింది. అందరూ బోల్డ్ ఇంటర్వ్యూ అంటున్నారు కానీ అందులో అంత బోల్డ్ ఏముందో అర్ధం కావడం లేదని చెప్పింది. ఆర్జీవీకి అమ్మాయిలను వేధించే అలవాటే ఉంటే గనుక ‘మీటూ’లో ఆయన పేరు ఎందుకు లేదని ప్రశ్నించింది. ఆయనపై ఎవరైనా ఫిర్యాదు చేశారా..? అంటూ లాజిక్ మాట్లాడింది.

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. కాంప్రమైజ్ అవ్వక తప్పదని అరియానా చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫీల్డ్ లో విజయం సాధించాలంటే కోపగించుకోకూడదని.. కోపం వలన సాధించేదేమీ లేదు కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిందే అని తెలిపింది. అలానే తనను ట్రోల్ చేస్తున్న వారు కూడా ఫేమస్ అవ్వడానికే చేస్తుంటారని కామెంట్స్ చేసింది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus