నాతో రొమాన్స్ చేయాలంటే అదృష్టం ఉండాలి!

  • October 13, 2017 / 01:18 PM IST

హీరోయిన్లన్నాక మరీ హీరోల కాలు కింద చెప్పులా ఉండాల్సిన అవసరం లేకపోయినా కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టార్ డమ్ మరియు వరుస ఆఫర్లు చేతిలో ఉన్నాయి కదా అని నోటికొచ్చినట్లు వాగడం ఎంత పెద్ద ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ అండ్ స్టార్ స్టేటస్ ఉన్నవారికైనా ప్రమాదకరమే. ఇప్పుడు ఆ ప్రమాదకర పరిస్థితికి అత్యంత చేరువలో ఉంది బాలీవుడ్ బొద్దుగుమ్మ పరిణీతిచోప్రా. మామూలుగానే విపరీతమైన యాటిట్యూడ్ ప్రదర్శించే పరిణీతి.. మీడియా వారితోనూ వెటకారంగా మాట్లాడి లేనిపోని తలపోట్లు కొనితెచ్చుకొన్న పరిణితి తాజాగానూ ఆదేస్థాయి వెటకారపు సమాధానాలతో ఏకంగా స్టార్ హీరో ఈగోను హార్ట్ చేసింది.

కెరీర్ మొదలెట్టిన కొత్తలో అర్జున్ కపూర్ తో “ఇషక్ జాదే” అనే చిత్రంలో నటించిన పరిణితి చోప్రా.. కొన్నేళ్ళ విరామం అనంతరం మళ్ళీ అర్జున్ కపూర్ తో రెండు కొత్త సినిమాలు అది కూడా వరుసగా సైన్ చేసింది. దాంతో.. అర్జున్ కపూర్ తో మళ్ళీ పనిచేయనుండడం అది కూడా వరుసగా రెండుసార్లు ఎలా ఉందని మీడియావారు ప్రశ్నించగా.. “అర్జున్ కపూర్ చాలా అదృష్టవంతుడు, లేదంటే వరుసగా రెండు సినిమాల్లో నాతో రొమాన్స్ చేసే అదృష్టాన్ని ఎలా సంపాదించుకొంటాడు?” అని తిక్క సమాధానమిచ్చింది. లక్కీగా.. అర్జున్ కపూర్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది కానీ.. ఇదే విషయాన్ని మరో హీరో అయితే సీరియస్ గా తీసుకోవడమే కాకుండా పరిణితికి ఇండస్ట్రీలో అవకాశాల్లేకుండా చేసేవాడు. ఈ విషయాన్ని గమనించి పరిణితి చోప్రా ఇప్పటికైనా కాస్త దూకుడు తగ్గించుకొంటే మంచిది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus