సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున్ రెడ్డి సినిమా ఫుల్ జోష్ తో దూసుకుపోతోంది. గతనెల 25 న విడుదలైన ఈ బోల్డ్ మూవీ అన్ని ఏరియాల్లో భారీ కలక్షన్స్ రాబడుతోంది.భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లో ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్ రాబట్టి ఆశ్చర్యం కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను అర్జున్ రెడ్డి మంచి వసూళ్లను సాధిస్తోంది. 1 .5 మిలియన్ డాలర్లు దాటి ఓవర్సీస్ లో ఈ మార్క్ సాధించిన ఐదవ తెలుగు చిత్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.
5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 22.6 కోట్ల షేర్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు తెలిపారు. నిన్న (శుక్రవారం) రిలీజ్ అయిన యుద్ధం శరణం, మేడ మీద అబ్బాయి సినిమాల్లో సత్తా లేకపోవడంతో అర్జున్ రెడ్డి కి ఇక తిరుగులేదని భావిస్తున్నారు. సెప్టెంబర్ 21 వరకు వసూళ్ల జోరు కొనసాగించి, మంచి కలక్షన్స్ రాబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.