తెలుగులో అఖండ విజయం సొంతం చేసుకోవడమే కాక సరికొత్త సంచలనాలు సృష్టించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. హిందీ వెర్షన్ ని తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సండీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేస్తుండగా.. తమిళ వెర్షన్ కు బాల దర్శకత్వం వహిస్తున్నారు. రెండు వెర్షన్ చిత్రాలు త్వరలోనే విడుదలకావాల్సి ఉండగా.. ఉన్నట్లుండి తమిళ వెర్షన్ ను విడుదల చేయడం లేదని స్వయంగా నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. అందుకు కారణం కూడా చెప్పడం విశేషం.
తెలుగులో కల్ట్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ ను బాల సరిగా తీయలేదని, ఆ అవుట్ పుట్ ప్రొడక్షన్ టీం కి అస్సలు నచ్చలేదని, అందుకే సినిమా మొత్తం రీషూట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. హీరో ధృవ్ తప్ప టీం అందర్నీ మార్చి షూట్ చేయనున్నారు. ఈ చిత్రానికి ఎవరైనా పేరున్న లేదా కొత్త దర్శకుడ్ని తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ విషయం తెలియడంతో.. “అర్జున్ రెడ్డి” కల్ట్ ఫ్యాన్స్ అందరూ హమ్మయ్య అనుకున్నారు. మరి తమిళ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ అలా ఉన్నాయి మరి.