‘అర్జున్ సురవరం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్..!

  • December 2, 2019 / 03:25 PM IST

అనేకసార్లు రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ‘అర్జున్ సురవరం’ చిత్రం ఎట్టకేలకు నవంబర్ 29న విడుదలయ్యింది. నిఖిల్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ చిత్రాన్ని టి.సంతోష్ డైరెక్ట్ చేసాడు. రాజ్ కుమార్ ఆకెళ్ళ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఠాగూర్’ మధు సమర్పకుడు. రిలీజ్ లేటవుతూ రావడంతో ఈ చిత్రానికి పెద్ద స్థాయిలో బిజినెస్ జరగలేదనే చెప్పాలి. దీంతో నిర్మాతలు చాలా వరకూ ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే మొదటి రోజు డీసెంట్ టాక్ రావడంతో… వీకెండ్ ను బాగానే క్యాష్ చేసుకుంది ఈ చిత్రం.

నైజాం 0.85 cr
సీడెడ్ 0.43 cr
ఉత్తరాంధ్ర 0.52 cr
ఈస్ట్ 0.33 cr
వెస్ట్ 0.27 cr
కృష్ణా 0.36 cr
గుంటూరు 0.50 cr
నెల్లూరు 0.23 cr
ఏపీ + తెలంగాణ 3.49 cr(share)
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.22 cr
ఓవర్సీస్ 0.48 cr
టోటల్ వరల్డ్ వైడ్ 4.19 cr (share)

ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ‘అర్జున్ సురవరం’ చిత్రానికి 5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. మిగిలిన ప్లేసుల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారని తెలుస్తుంది. సో ఈ చిత్రం 5 కోట్ల షేర్ ను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించేసినట్టే. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 4.19 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 80 శాతం పైనే రికవరీ సాధించేసినట్టే. వీక్ డేస్ లో కూడా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబడితే హిట్ స్టేటస్ కేక్ వాక్ అనే చెప్పాలి.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus