సాహో షూటింగ్ లో జాయిన్ అయిన అరుణ్ విజయ్

బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా తాజా షెడ్యూల్ దుబాయిలోని అబుదాబి లో సాగుతోన్న విషయం తెలిసిందే. గత పది రోజులుగా ప్రభాస్, నీల్ నితిన్ ముఖేష్, కొంతమంది ఫైటర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సీన్ సినిమాలో హైలెట్ గా నిలవనుంది. ఈ షూటింగ్ లో గతవారం శ్రద్ధ కపూర్ జాయిన్ అయింది. ప్రభాస్ తో కలిసి గ్యాంగ్ స్టర్స్ ని పట్టుకునే సన్నివేశంలో సాహసాలు చేస్తోంది. తాజాగా ఈ షెడ్యూల్లో తమిళ నటుడు అరుణ్ విజయ్ పాల్గొన్నారు. అయితే ఇతను ప్రభాస్ టీమ్ లో ఉంటాడా? లేక విలన్ టీమ్ లో ఉంటాడా?

అనేది చిత్ర బృందం బయటికి వెల్లడించలేదు. అరుణ్ విజయ్ రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో నెగటివ్ పాత్రలో మెప్పించారు. ఇప్పుడు సాహో లో చేస్తున్నారు. 90 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తమవుతున్న ఈ షెడ్యూల్ మరికొన్ని రోజుల పాటు దుబాయ్ లోని ప్రఖ్యాత ప్రాంతాల్లో సాగనుంది. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ టీ సిరీస్ తో కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న మూవీ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది. బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లు  సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus