ఇటీవల కాలంలో సినీ సెలెబ్రిటీలు అందరూ కూడా వరుసగా పెళ్లిళ్లు చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు. కొత్త ఏడాదిలో కూడా మరి కొంతమంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రముఖ దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక శిరీష్ వారసుడిగా ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నటువంటి ఆశిష్ (Ashish Reddy) త్వరలోనే సెల్ఫిష్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఈ సినిమాతో పాటు మరో సినిమాని కూడా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా కెరియర్ విషయం పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఆశిష్ రెడ్డి గత ఏడాది నవంబర్ నెలలో విజయవాడకు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ కుమార్తె అద్విత రెడ్డితో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ నిశ్చితార్థ వేడుకకు కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యి ఎంతో ఘనంగా ఈ వేడుకను పూర్తి చేశారు. తాజాగా ఈయన పెళ్లికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. ఫిబ్రవరి 14వ తేదీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆశిష్ వివాహం జరగబోతుందని ఈయన వివాహం ఉదయపూర్ లోని ఓ రాజ్ మహల్ లో ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజుతో పాటు శిరీష్ ఇద్దరు కలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ సెలెబ్రెటీల అందరిని కూడా ఈ వివాహానికి ఆహ్వానిస్తున్నారు.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!