సమంతకి అషురెడ్డి ట్రిబ్యూట్..’ఊ అంటావా ఉఊ అంటావా’ అంటూ అదిరిపోయే స్టెప్పులు..!

ఇటీవల విడుదలైన ‘పుష్ప ది రైజ్’ చిత్రంలో ‘ఊ అంటావా ఉఊ అంటావా’ అనే మాస్ బీట్ ఉంటుంది. ఈ సాంగ్ లో నర్తించింది సమంత. ఆమె కెరీర్లో మొదటి ఐటెం సాంగ్ ఇది.ఈ పాటకి ఎన్నో విమర్శలు తలెత్తాయి. మగాళ్ళ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ చేసిన ఈ పాట.. దేశమంతా పాపులర్ అయిపోయింది. ఈ పాటకి బోలెడన్ని రీమిక్స్ లు కూడా వచ్చాయి. సమంత ఈ పాటలో బన్నీతో కలిసి వేసిన స్టెప్పులు కూడా హైలెట్ అయ్యాయి.

ఈ క్రమంలో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న ‘బిగ్ బాస్3’ బ్యూటీ అషు రెడ్డి… ఈ పాటకి తనదైన స్టైల్లో కవర్ సాంగ్ చేసింది. సమంతలానే పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని… “ఊ అంటావా మావా” అంటూ ఊపేసింది.ముందుగానే ఆ పాటకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని సైతం అషు రెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ‘సమంతకి ఇది నా ట్రిబ్యూట్’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది. ఆ కవర్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో కూడా విడుదలవ్వడం…

ఇప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం కూడా జరిగిపోతుంది. ‘అచ్చంగా సమంతలానే చేసింది’ అనే ప్రశంసలు కూడా అందుకుంటుంది అషు రెడ్డి. ఈ పాట విడుదలైన 5 రోజుల్లోనే 4 మిలియన్లకి పైగా వ్యూస్ ను నమోదు చేయడం విశేషం. ‘ఊ అంటావా ఉఊ అంటావా’ పాటకి ఎన్నో కవర్ సాంగ్ లు వచ్చాయి కానీ ఇది అషురెడ్డి చేసిన కవర్ సాంగ్ వాటిని డామినేట్ చేసేలా కనిపిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!


83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus