Ashu Reddy, Ariyana: అరియానా నడుముపై ముద్దు పెట్టిన అషు రెడ్డి!

2018 లో పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల నిర్మాణంలో నితిన్ హీరోగా వచ్చిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది ఆషూ రెడ్డి. అనూహ్యంగా ఈమెకు ‘బిగ్ బాస్3’ లో అవకాశం వచ్చింది. అయితే అప్పుడు ఈ అమ్మడు లుక్ చూసినవాళ్లంతా షాక్ అయ్యారు. చూడ్డానికి చాలా బొద్దుగా కనిపించేసరికి నెటిజన్లు ట్రోల్ కూడా చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ఫిజిక్ పై కాన్సెన్ట్రేట్ చేయలేదని.. దాంతో అలా లావైపోయినట్టు చెప్పుకొచ్చింది. అయితే ఈ రెండేళ్ళల్లో అషు చాలా స్లిమ్ అయ్యింది. అంతేకాదు గ్లామర్ షో కూడా పెంచేసింది.

అరియానా, యాంకర్ గా ఎంటర్టైన్మెంట్ వరల్డ్ లోకి అడుగుపెట్టిన అరియానా గ్లోరీ కొన్నాళ్ల తరువాత రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మెల్లగా ఆమె బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి ఊహించని విధంగా క్రేజ్ అందుకుంది. అసలు ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ రోజులు కొనసాగుతుంది అని ఎవరూ ఊహించలేదు. కానీ ఫైనల్ ఫైవ్ వరకు గట్టిపోటీని ఇచ్చింది.

అరియానా గ్లోరీ, అషు రెడ్డి ఓ ఛానల్ నిర్వహిస్తున్న స్పెషల్ షో లో పాల్గొనేందుకు వీరిద్దరూ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అరియానా నడుమును చూసిన అషు రెడ్డి.. వెంటనే అరియానా నడుముకు ముద్దు పెట్టేసింది. అషు రెడ్డి తన నడుముకు ముద్దు పెట్టేసరికి అరియానా ఉక్కిరిబిక్కిరికి గురైంది. అయితే ఆ సమయంలో అరియానా ఇచ్చిన హావభావాలను ఉద్దేశిస్తూ అషు రెడ్డి ఓ పోస్టు పెట్టింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్లు దారుణంగా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus