నటి అషురెడ్డి బిగ్ బాస్ జోడీ డాన్స్ షో నుంచి తప్పుకుంది. దీనికి కారణం ఏంటనేది తెలియదు కానీ ఆమె అలా షో నుంచి బయటకు రావడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు. అయితే అషురెడ్డి రీసెంట్ గా ఈ వ్యవహారంపై నోరు విప్పింది. ఆరోగ్య సమస్యల వలనే తను బిగ్ బాస్ జోడీ నుంచి బయటకు వచ్చానని.. డాక్టర్స్ నెలల పాటు రెస్ట్ అవసరమని చెప్పడంతో తప్పలేదని చెప్పుకొచ్చింది.
సోషల్ మీడియాలో నెటిజన్స్ తో ముచ్చటించిన ఆమె ఈ విషయం చెప్పింది. ఇతరుల బాధ నుంచి కామెడీ చేయొద్దని.. ఇతరుల జీవితంలో సమస్యలు మీకు తెలియకపోవచ్చంటూ కాస్త ఘాటుగానే స్పందించింది అషురెడ్డి. ఎన్నారై ట్యాగ్ తో ఇండియాలో ఎంట్రీ ఇచ్చిన అషురెడ్డి యూట్యూబర్ లో వీడియోలను పోస్ట్ చేస్తూ.. రీల్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘ఛల్ మోహనరంగ’ సినిమాతో పాటు కొన్ని సినిమాల్లో నటించింది. అయితే ఈ సినిమాలేవీ కూడా ఆమెకి సరైన గుర్తింపుని తీసుకురాలేకపోయాయి.
అదే సమయంలో ఆమెకి బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఛాన్స్ రావడంతో షోలో పాల్గొంది. ఈ షో ఆమె కెరీర్ కి హెల్ప్ అయిందనే చెప్పాలి. అప్పటికే సోషల్ మీడియాలో తనకంటూ ఓ ఫాలోయింగ్ సంపాదించుకున్న అషురెడ్డి.. బిగ్ బాస్ షోతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పలు కాంట్రవర్సీ వార్తల్లో ఆమె పేరు బాగా వినిపిస్తోంది.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మను అషురెడ్డి ఇంటర్వ్యూ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూలో వర్మ.. అషురెడ్డి పాదాలను ముద్దుపెట్టుకోవడం ఆమెకి ఇబ్బందులను తీసుకొచ్చింది. ఆమె వేసుకున్న బట్టలు, ప్రవర్తించిన తీరుపై బాగా విమర్శలు వచ్చాయి. ఆర్జీవీతో పాటు అషురెడ్డిని కూడా బాగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా ముందుకు సాగిపోతుంది ఈ బ్యూటీ.