కావాలనే ఏడిపిస్తున్నావంటూ కామెంట్స్.. వీడియో వైరల్..!

సోషల్ మీడియా అంటే అంతే మరి.. ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో.. ఎంతలా వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు.. కానీ, ఒకవేళ అయితే మాత్రం సూపర్ లక్కే.. డబ్ స్మాష్‌లు, టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా పాపులర్ అయిన వాళ్లను ఎంతోమందిని చూశాం.. ఈమధ్య అలా పాపులర్ అయిందే భానుశ్రీ పాడిన పాట.. పవన్ కళ్యాణ్ ‘తీన్‌మార్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే తీసే’ అనే పాటను భాను పాడినప్పటి నుండి నెట్టింట ఆ వీడియో ట్రెండ్ అవడంతో పాటు దాన్ని బేస్ చేసుకుని క్రియేట్ చేసిన మీమ్స్ అయితే మాత్రం మామూలుగా వైైరల్ అవట్లేదసలు..

ఫన్నీ మీమ్స్ చేసే వాళ్లు తమ క్రియేటివిటినీ యాడ్ చేసి నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. రీసెంట్‌గా అషు రెడ్డి కూడా భానుని ట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. అలా ఇలా కాదు.. ఏకంగా వీడియో పోస్ట్ చేసి మరీ హంగామా చేసింది.. మేటర్‌లోకెళ్తే.. ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ తర్వాత ఆ రేంజ్‌లో ఫేమస్ అయిన షో అంటే అది ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ నే. ఇందులో కమెడియన్లతో యాంకర్లు, టీవీ ఆర్టిస్టులు అందరూ కనిపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తుంటారు.

రీసెంట్‌‌గా జరిగిన ఎపిసోడ్‌లో నటి భాను, ‘తీన్ మార్’ సినిమాలోని ‘గెలుపు తలుపులే’ సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ.. ‘పాటలో డెప్త్ కనపడుతుంది’ అని చెప్పింది. అంతే, ఈ విషయాన్ని మీమర్స్ పట్టేశారు. ఇక చూసుకోండి.. అప్పటి నుండి భానుపై ట్రోలింగ్ మొదలైంది. ఓ వారం నుండి భాను పాటపై పేరడీలు క్రియేట్ చేస్తున్న మీమర్స్.. నెటిజన్లను భలే ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు అషు రెడ్డి రంగంలోకి దిగింది. ఈ సాంగ్ మీద ఏకంగా ఓ వీడియో చేసింది.

‘నీ ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు’ అంటూ భానుశ్రీని ట్యాగ్ చేసింది. దీన్నిబట్టి చూస్తుంటే అషు, భానుని కావాలనే ఫన్నీగా ట్రోల్ చేసింది కానీ నెగిటివ్‌గా అనుకోవడానికేం లేదని అర్థమవుతోంది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మొన్నా మధ్య హాలీడే ట్రిప్‌కి వెళ్లింది అషు రెడ్డి.. ప్యారిస్, జర్మనీతో సహా పలు ప్రాంతాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేసింది.. అక్కడి నుండి తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సెగలు రేపింది. ప్రస్తుతం సినిమాల మీద ఫోకస్ పెట్టిందని తెలుస్తోంది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus