Anushka Shetty Marriage: అనుష్క పెళ్లిపై జ్యోతిష్యుడి కామెంట్స్ వైరల్!

  • September 27, 2021 / 05:45 PM IST

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి వయస్సు ప్రస్తుతం 39 సంవత్సరాలు కాగా అనుష్క శెట్టి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుష్కతో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో చాలామంది హీరోయిన్లు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. అనుష్కకు సినిమా ఆఫర్లు కూడా గతంతో పోలిస్తే తగ్గడంతో ఆమె పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులలో చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రముఖ పండితుడు పండిట్ జగన్నాథ్ గురూజీ అనుష్క పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

స్టార్ హీరోయిన్ అనుష్కకు త్వరలోనే వివాహం జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అనుష్క పెళ్లికి సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఒక బిజినెస్ మేన్ తో అనుష్క పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రచారం జరిగింది. అనుష్కకు సినిమాలతో సంబంధం లేని వ్యక్తితో వివాహం జరుగుతుందని 2023 సంవత్సరంలోపు అనుష్కకు మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉందని పండిట్ జగన్నాథ్ గురూజీ అన్నారు. నిశ్శబ్దం సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్న తర్వాత అనుష్క సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉన్నా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. త్వరలో ఈ సినిమా గురించి ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాల్సి ఉంది. అనుష్క పెళ్లికి సంబంధించిన శుభవార్త కోసం అనుష్క ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుష్క కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటూ ప్రాధాన్యత ఉండే కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus