ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి (Venu Swamy) గురించి తెలియని వారంటూ ఉండరు. టాలీవుడ్ సెలబ్రిటీలకు జాతకాలు చెబుతానంటూ..పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చేవాడు. నాగ చైతన్య (Naga Chaitanya) – సమంత (Samantha) .. విడిపోతారని, ప్రభాస్ సినీ కెరీర్ ముగిసిందని, రాజమౌళి కెరీర్ కూడా త్వరలోనే ముగుస్తుందని, ఏపీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ మళ్ళీ గెలిచి జగన్ సీఎం అవుతాడని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దారుణంగా ఓడిపోతాడని.. ఇలా నోటికొచ్చిందల్లా వాగుతూ వచ్చాడు వెనుస్వామి. అన్నీ ఎలా ఉన్నా..
ఇటీవల నాగ చైతన్య- శోభిత (Sobhita Dhulipala) ఎంగేజ్మెంట్ చేసుకుంటే.. ఆ మరుసటి రోజే వాళ్ళు ‘ఎక్కువ కాలం కలిసుండరు.. విడిపోతారు’ అంటూ జోస్యం చెప్పాడు వేణు స్వామి. దీనివల్ల అతనిపై పోలీస్ కేసు కూడా రిజిస్టర్ అయ్యింది. వాస్తవానికి ఈ కాంట్రోవర్సీలు అన్నీ బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టడానికి ఉపయోగపడతాయి. బిగ్ బాస్ 8 .. మొదలవుతుందని తెలిసినప్పటి నుండే మొదటి 5 మంది కంటెస్టెంట్ల లిస్ట్ లో వేణు స్వామి పేరు చేర్చడం జరిగింది. అయితే అతను బిగ్ బాస్ యాజమాన్యానికి చాలా కండీషన్లు పెట్టాడట.
‘హౌస్ లో తనని చివరి వారం వరకు ఉంచాలని, ఫిజికల్ టాస్కులకి తనని మినహాయించాలని.. ఇలా చాలా కండీషన్లు పెట్టాడట. మొదట టీఆర్పీని దృష్టిలో పెట్టుకుని వేణు స్వామి కండీషన్స్ కి ఓకే చెప్పిందట బిగ్ బాస్ యాజమాన్యం. కానీ స్వయంగా హోస్ట్ నాగార్జున (Nagarjuna) కొడుకు-కాబోయే కోడలి పర్సనల్ లైఫ్ పై.. అతను కామెంట్స్ చేయడంతో బిగ్ బాస్ యూనిట్.. వేణు స్వామిని పక్కన పెట్టాలని డిసైడ్ అయ్యిందట. కానీ ఇంతలోనే వేణు స్వామే (Venu Swamy) ‘బిగ్ బాస్ 8’ వద్దనుకున్నట్టు సమాచారం.