స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) ఇటీవల ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన అజయ్ దేవగన్ (Ajay Devgn) ‘రైడ్’ కి ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగ్గట్టు.. తన శైలికి తగినట్టు.. చాలా మార్పులు చేశాడు హరీష్ శంకర్. సినిమా బాగానే ఉన్నప్పటికీ ఎందుకో ప్రేక్షకులు దీన్ని తిప్పికొట్టారు. అప్పటికీ సెకండ్ హాఫ్ లో ఉన్న కొంత ల్యాగ్ ను తగ్గించేందుకు.. 13 నిమిషాల పోర్షన్ ను ట్రిమ్ కూడా చేశారు మేకర్స్.
అయినా సరే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. హాలిడేస్ ని కూడా ‘మిస్టర్ బచ్చన్’ క్యాష్ చేసుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద రూ.10 కోట్లు షేర్ కూడా వచ్చే ఛాన్సులు కనిపించడం లేదు. సినిమా రూ.34 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. సో మొత్తంగా రూ.20 కోట్ల వరకు నష్టాలు వచ్చేలా ఉన్నాయి. దీంతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ నష్టాలకు.. బాధ్యత వహిస్తూ తన పారితోషికంలో కొంత భాగాన్ని వెనక్కి ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
‘మిస్టర్ బచ్చన్’ సినిమాకి హరీష్ శంకర్ రూ.15 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడు. ఇందులో కొంత వెనక్కి ఇస్తానని నిర్మాతలకి చెప్పాడట. అలాగే ఇదే బ్యానర్లో ఇంకో సినిమా కూడా చేస్తానని కూడా హరీష్ శంకర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. హీరో రవితేజ నుండి అయితే ఇలాంటివి ఏమీ కనిపించడం లేదు. ప్రమోషన్స్ కి కూడా రవితేజ (Ravi Teja) ఎక్కువగా హాజయ్యింది లేదు. హరీష్ శంకర్ మాత్రమే తన భుజాలపై వేసుకుని సినిమాను ప్రమోట్ చేశాడు.