Siddhu Jonnalagadda: ‘కల్కి..’ లాంటి సినిమా జోక్ కాదు.. గౌరవాన్ని కాపాడుకోవాలి : సిద్ధు జొన్నలగడ్డ

ఇటీవల బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ (Arshad Warsi)   … ‘ ‘కల్కి…’ (Kalki 2898 AD)  సినిమాలో ప్రభాస్  (Prabhas) లుక్ జోకర్ లా ఉందంటూ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ప్రభాస్ పట్టించుకోలేదు కానీ టాలీవుడ్ మాత్రం సీరియస్ గా తీసుకుంది. ఆల్రెడీ నాని (Nani) అర్షద్ పై సెటైర్ వేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) సైతం స్పందిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశాడు. సిద్ధు ఆ లెటర్ ద్వారా స్పందిస్తూ.. “ప్రతి ఒక్కరికి తమ వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉంటుంది.

Siddhu Jonnalagadda

తమ అభిప్రాయాలను తెలియజేసే హక్కు అందరికీ ఉంది. మన ఆలోచన,అభిరుచి.. వంటి వాటిని బట్టి మనకు ఒక్కో నటుడు నచ్చవచ్చు.సినిమాలు కూడా మనకు అలాగే నచ్చుతాయి. అందరికీ అన్ని సినిమాలు నచ్చని రూల్ లేదు.ఈ క్రమంలో వేరే వాళ్ల సినిమాలను, వేరే నటుల్ని విమర్శించడం వంటివి కూడా జరుగుతాయి. అయితే విమర్శించే పద్ధతి చాలా ముఖ్యం. నిర్మాణాత్మక, వివరణాత్మక విమర్శలు చేయడంలో తప్పులేదు.

కానీ, జోకర్‌ వంటి పదాలు వాడటం అనేది సరైన పద్ధతి కాదు. ‘కల్కి 2898 ad‘ సినిమా జోక్ కాదు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ సినిమా.విజువల్ వండర్ గా నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇండియన్ స్టార్‌ హీరోల్లో ప్రభాస్‌ అన్న స్టార్ డమ్ కి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన స్టార్ డమ్ కి సక్సెలతో సంబంధం ఉండదు.

ఆయన ప్లాప్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ అన్న గురించి చాలా ఉన్నాయి. ‘కల్కి 2898 ad’ వంటి భారీ సినిమా వచ్చింది అంటే ప్రభాస్ అన్నవల్లనే. ఆయన అభిమానుల్లో ఒకరిగా నిజాలు మాత్రమే మాట్లాడుతున్నా. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మేము (Siddhu Jonnalagadda) అందరి అభిప్రాయాలను గౌరవిస్తాం. దయచేసి పరస్పర గౌరవాన్ని కాపాడుకుందాం’’ అంటూ పేర్కొన్నాడు.

ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus