Allu Arjun: ఇష్టమైన వారిపై ప్రేమ చూపించాలి.. బన్నీ కామెంట్స్ వైరల్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా రవి తరపున బన్నీ ప్రచారం చేయడం సోషల్ మీడియాలో ఒకింత సంచలనం అయింది. అయితే ఆ ఘటన తర్వాత మీడియా ముందుకు ఎప్పుడూ రాని బన్నీ మారుతీనగర్ సుబ్రహ్మణ్యం (Maruthi Nagar Subramanyam) మూవీ ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Allu Arjun

మై డియర్ ఫ్యాన్స్.. నా ఆర్మీ.. ఐ లవ్ యూ అంటూ బన్నీ తన అభిమానులపై ప్రేమను కురిపించారు. నా అభిమానులంటే నాకు పిచ్చి అని హీరోను చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారని నేను మాత్రం నా అభిమానులను చూసి హీరో అయ్యానని చెప్పుకొచ్చారు. నా నుంచి కొత్త సినిమా వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా అభిమానులు నాపై చూపించే ప్రేమ ఏ మాత్రం తగ్గలేదని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని మరోసారి అభిమానులను ఇబ్బంది పెట్టనని బన్నీ (Allu Arjun) తెలిపారు. తప్పకుండా తాను ఎక్కువ సినిమాలు చేస్తానని తెరపై తరచూ కనిపిస్తానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. సుకుమార్ (Sukumar) భార్య తబిత మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాను ప్రజెంట్ చేస్తున్నారని ఆమె ఆహ్వానించడంతో ఈ ఈవెంట్ కు వచ్చానని అల్లు అర్జున్ కామెంట్లు చేశారు.

ఇష్టమైన వారిపై మన ప్రేమ చూపించాలని మనం నిలబడగలగాలని నాకు ఇష్టమైతే నేనొస్తానని మనసుకు నచ్చింది చేస్తానని బన్నీ వెల్లడించారు. బన్నీ తన మాటలతో ఎన్నో ప్రశ్నలకు జవాబులను చెప్పకనే చెప్పేశారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. పుష్ప ది రూల్ (Pushpa2) వాయిదా అంటూ వార్తలు వినిపిస్తున్నా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది. చెప్పిన తేదీకే పుష్ప2 మూవీ థియేటర్లలో విడుదల కానుంది.

నవీన్‌ పొలిశెట్టి వచ్చాడు.. నవ్వులు తెచ్చాడు.. త్వరలో అంటూ..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus