చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకున్న నాగశౌర్య అండ్ టీం

  • January 30, 2020 / 12:27 PM IST

దాసరి నారాయాణరావు గారి మరణం అనంతరం ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేని లోటును భర్తీ చేసిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన తన ఫ్యామిలీ సినిమాల్ని మాత్రమే కాదు.. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన చిన్న సినిమాలకు తన సపోర్ట్ అందిస్తుంటారు. “అందరివాడు” అనే ఆయన సినిమా టైటిల్ ను క్యారెక్టరైజేషన్ గా మార్చుకున్న చిరంజీవి దగ్గరకి ఆయన్ను ఆరాధ్యంగా భావించే హీరోలు తమ సినిమాను ఆశీర్వదించమని వస్తూ ఉంటారు. కుదిరితే వాళ్ళ సినిమాల ఫంక్షన్స్ కు వెళ్ళి అందరికీ సినిమాలో బాగున్న విషయాలను వివరించి.. సినిమా చూడమని చెబుతారు చిరంజీవి. కుదరకపోతే కనీసం స్పెషల్ బైట్స్ ఇచ్చి సినిమాను ఎంకరేజ్ చేస్తారు.

నాగశౌర్య రచయితగా మారి నటించిన “అశ్వథ్థామ” చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయాలనుకొని ఆఖరు నిమిషంలో క్యాన్సిల్ చేశారు. అయితే.. నిన్న సాయంత్రం హీరో & రైటర్ నాగశౌర్య, ప్రొడ్యూసర్ ఉషా వెళ్ళి చిరంజీవిని కలిశారు. ఆయన సినిమా ట్రైలర్ & ప్రోమోస్ చూసి సినిమా తప్పకుండా హిట్ అవుతుంది అని దీవించారట.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus