ఆలియా భట్, రణ్‌బీర్‌లానే కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి.. ఎక్కడంటే..?

  • January 7, 2023 / 05:12 PM IST

గతకొద్ది రోజులుగా వివిధ భాషలకు చెందిన స్టార్స్ వరుసగా గుడ్ న్యూస్‌లు చెప్తున్నారు.. ఎంగేజ్‌మెంట్, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్.. ఇలాంటి శుభవార్తలను పరిశ్రమ వర్గాలు.. ఫ్యాన్స్ అండ్ నెటిజన్లతో షేర్ చేసుకుంటున్నారు.. ఇప్పటికే హన్సిక, నాగ శౌర్య వంటి సెలబ్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు..ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నిశ్చితార్థం, పెళ్లి గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.. ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శర్వా ఎంగేజ్‌మెంట్ జనవరి 26న హైదరాబాద్‌లో జరుగనుందని సమాచారం..

త్వరలో ఈ లిస్టులో మరికొంత మంది సెలబ్రిటీలు యాడ్ కాబోతున్నారు.. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, యంగ్ క్రికెటర్ కేఎల్ రాహుల్ జంట పెళ్లి గురించిన వార్తలు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.. అతియా శెట్టి – కేఎల్ రాహుల్ గతకొద్ది కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పారు.. ఇప్పుడు వివాహబంధంతో ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు..

సునీల్ శెట్టి కూడా వీరి ప్రేమకి పచ్చజెండా ఊపుతూ.. మంచి సమయం చూసుకుని పెళ్లి జరిపిస్తామని చెప్పారు.. అయితే జనవరి 21 – 23 మధ్య అతియా – రాహుల్‌ల వివాహం జరుగనుందని అంటున్నారు.. ఈమధ్య కాలంలో సెలబ్రిటీలంతా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్నారు.. అయితే వీరు మాత్రం ఖండాలాలోని సునీల్ శెట్టి ఇంట్లో సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట.. ఫ్యామిలీ, కొద్ది మంది ఫ్రెండ్స్ మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరపాలనుకుంటున్నారు..

ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అతియా శెట్టి – కేఎల్ రాహుల్ ఇటీవల దుబాయ్ వెళ్లారు.. ఈ ప్రేమ పక్షులు అక్కడ పార్టీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి.. ఆలియా భట్ – రణ్‌బీర్ కపూర్ జంటలాగే వీళ్లు కూడా సింపుల్‌గా పెళ్లి చేసుకోబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. మూవీ అండ్ క్రికెట్ ఫ్యాన్స్ వీరికి విషెస్ తెలియజేస్తున్నారు..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus