Atithi Devo Bhava Collections: మంచి డేట్ దొరికినా..ఈ ‘అతిథి’ కి కలిసి రాలేదు..!

Advertisement

ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్ గా పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ‘శ్రీనివాస సినీ క్రియేషన్స్‌’ పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 7న ఈ చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ మధ్య కాలంలో ఆది నటించిన సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఈసారి మాత్రం కచ్చితంగా హిట్టు కొట్టాలి అనే కసితో ‘అతిథి దేవో భవ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆది.

రెండు పాటలు హిట్ అయ్యాయి. ప్రోమోస్ కూడా బాగానే అనిపించాయి. దానికి తోడు ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బడా సినిమా రిలీజ్ కావాల్సిన డేట్ ను ఆకుపై చేసింది. అయితే మౌత్ టాక్ బ్యాడ్ గా ఉండడం వల్ల కలెక్షన్లు మినిమమ్ కూడా నమోదవ్వలేదు. ఒకసారి మొదటి రోజు కలెక్షన్లను గమనిస్తే :

నైజాం  0.08 cr
సీడెడ్  0.03 cr
ఆంధ్రా(టోటల్)  0.06 cr
ఏపి+తెలంగాణ (టోటల్)  0.17 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
+ ఓవర్సీస్
 0.01 cr
వరల్డ్ వైడ్ టోటల్  0.18 cr

‘అతిథి దేవో భవ’ చిత్రానికి రూ.1.31 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చాలా వరకు ఈ చిత్రాన్ని నిర్మాతలే ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే ఆ టార్గెట్ ను ఈ చిత్రం రీచ్ అవుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం.మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం రూ.0.18 కోట్ల షేర్ ను రాబట్టింది.ఇందులో నెగిటివ్ షేర్స్ రూ.0.05 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ రకంగా చూసుకుంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.1.40 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. ఈరోజు రెండో శనివారం హాలిడే ఉంది కాబట్టి.. ఏమైనా క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి..!

అతిథి దేవో భ‌వ సినిమా రివ్యూ & రేటింగ్!

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus