Atithi Devo Bhava Review: అతిథి దేవో భ‌వ సినిమా రివ్యూ & రేటింగ్!

నిజానికి అన్నీ బాగుంటే ఈ రోజు ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాని చూసేవాళ్ళం. కానీ ఒమిక్రాన్ మనకి ఆ అదృష్టం లేకుండా చేసేసింది. ఈ క్రమంలో ‘ఆర్.ఆర్.ఆర్’ లేని లోటుని భర్తీ చేయడానికి ఓ పది చిన్న సినిమాల వరకు ఈ సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. అందులో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ‘అతిథిదేవోభవ’ సినిమా ఒకటి.’ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి అనుకున్న రిలీజ్ డేట్ కి రాబోతున్నట్టు ప్రకటన చేయడం,

‘అఖండ’ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి బ్రదర్స్ రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన చిత్రం కావడం అలాగే శేఖర్ చంద్ర సంగీతంలో రూపొందిన పాటలు కూడా హిట్ అవ్వడంతో ఈ చిత్రం పై జనాల ఫోకస్ పడింది.మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఎంతవరకు ఆకట్టుకుంది.? మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది సాయి కుమార్ కు ఈ చిత్రం ఆ లోటుని తీర్చిందా? అనే విషయాలను తెలుసుకుందాం రండి:

కథ: అభయ్(ఆది సాయి కుమార్) కి మోనో ఫోబియా అనే డిజార్డర్ ఉంటుంది. అంటే ఒంటరితనాన్ని అతను భరించలేడు.. ఎక్కువ సేపు ఒంటరిగా ఉంటే అతను ప్రాణాలు తీసుకునే రేంజ్ కు వెళ్ళిపోతాడన్న మాట.అందుకోసమే ఇతని తల్లి(రోహిణి) ఇతన్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇతని ఓ కంపెనీకి బాస్ అయినప్పటికీ స్నేహితుడు గిరి(సప్తగిరి) తోడు లేకుండా ఎక్కడికీ వెళ్ళలేడు. ఇతనికి మోనో ఫోబియా ఉందని తెలిసి ప్రేమించిన అమ్మాయి కూడా బ్రేకప్ చెప్పేస్తుంది.

తర్వాత వైష్ణవి( నువేక్ష) పరిచయమవుతుంది. అభయ్ మానసిక స్థితి తెలీకుండా ఆమె ఇతని ప్రేమలో పడుతుంది.అభయ్ కూడా ఆమె ప్రేమ ఎక్కడ దూరమవుతుందో అని భయపడి ఆ విషయాన్ని చెప్పడు. కానీ ఓ రోజు హీరో తల్లి ఎమర్జెన్సీ కారణంగా వేరే ఊరు వెళ్తుంది. కాబట్టి హీరో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఆ టైములో ఇతనికి కొన్ని ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.దాంతో ఇతని లవ్ కూడా ప్రాబ్లమ్లో పడుతుంది. ఆ సమస్యల్ని హీరో ఎలా ఫేస్ చేసి సాల్వ్ చేసుకున్నాడు అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు: ఆది సాయి కుమార్ ట్యాలెంట్ గురించి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి అందరికీ తెలిసిందే.డ్యాన్స్ లు ఫైట్ లు కూడా బాగానే చేస్తాడు. ఈ సినిమాలో మాత్రం అతను అంత యాక్టివ్ గా కనిపించలేదు. ఆ పాత్రే అలాంటిది లెండి.అతని బ్యాడ్ ఫామ్ ఈ చిత్రం కూడా కంటిన్యూ చేస్తుంది. హీరోయిన్ నువేక్ష బాగానే చేసింది కానీ ఆమెను చూస్తే చిన్నపిల్లలానే కనిపించింది. రోహిణి తనకి అలవాటైన అమ్మ పాత్రలో పర్వాలేదనిపించింది. సప్తగిరి మార్క్ కామెడీ ఈ మధ్య కాలంలో మిస్ అవుతూ వస్తోంది. ఇందులో కూడా అంతే..! డాక్టర్ పాత్ర పోషించిన సీనియర్ నటుడు సూర్య ఓకె అనిపించాడు. మిగిలిన పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు: దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ ఎంచుకున్నది కొత్త కథ ఏమీ కాదు. తెలుగు ప్రేక్షకులకి మారుతీ అలవాటు చేసిన వింత జబ్బుల కథే ఇది. అయితే అలాంటి ఫార్ములాతో ఈ మధ్య మారుతీనే సక్సెస్ లు అందుకోలేకపోతున్నాడు. అలాంటిది కొత్త దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ ఎంత..! కనీసం తాను అనుకున్న పాయింట్ ను ఆసక్తిగా మలచడంలో కూడా అతను సక్సెస్ కాలేకపోయాడు.నిర్మాణ విలువలు ఓకె. అమర్ నాద్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఓకె అనిపిస్తుంది. అయితే నీరసంగా సాగుతున్న సినిమాకి ఏమైనా ప్లస్ పాయింట్ ఉందా అంటే అది కచ్చితంగా శేఖర్ చంద్ర మ్యూజిక్ అనే చెప్పాలి.’బాగుందే’ ‘నిన్ను చూడగానే’ వంటి రెండు పాటలు థియేటర్ నుండీ బయటకి వచ్చాక కూడా వెంటాడతాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా అతను పర్వాలేదు అనిపించాడు.

విశ్లేషణ : ఒక్క శేఖర్ చంద్ర మ్యూజిక్ తప్ప ఈ సినిమాకి మరో హైలెట్ లేదు.ఎంతో పేషెన్స్ ఉంటే తప్ప 2గంటల 13 నిమిషాల పాటు థియేటర్లో కూర్చోవడం చాలా కష్టం. ఆదికి హిట్టిచ్చే… అతిథి అయితే కాదు.

రేటింగ్: 1.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus