టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన శశిప్రీతమ్ మీద దాడి జరిగింది. శశిప్రీతమ్ ఇంటి ఎదురుగా ఉండే భానుప్రసాద్ అనే వ్యక్తి ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. ఒక మ్యూజిక్ ఆల్బం విషయంలో వచ్చిన విభేదాల వలన వీరి మధ్య మనస్పర్ధలు వచ్చాయట. ఇందులో భాగంగానే శశి ప్రీతమ్ మీద దాడి చేసినట్లుగా తెలుస్తోంది. తల మీద గాయంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ తనపై భానుప్రసాద్ అనే వ్యక్తి దాడి చేసినట్లుగా పేర్కొన్నారు. అతని ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు శశిప్రీతమ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.