‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ నటి శ్రీసుధా మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విజయవాడలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పై తన కారుకి యాక్సిడెంట్ అయిందని.. అయితే ఇది యాక్సిడెంట్ కాదని.. తనను చంపడానికి చేసిన కుట్ర అంటూ శ్రీసుధ విజయవాడ పోలీసులను కంప్లైంట్ చేసింది. ఈ కుట్ర వెనుక ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు ఉన్నాడనే సందేహం ఆమె వ్యక్తం చేయడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో శ్యామ్ కె నాయుడుపై శ్రీసుధ లైంగిక ఆరోపణల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. శారీరకంగా వాడుకొని మోసం చేశాడంటూ ఆమె హైదరాబాద్ లో ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ విషయంలో అప్పట్లో చర్చనీయాంశమైంది. కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయంటూ శ్రీసుధ అప్పట్లోనే పోలీసులకు వివరించింది. ఇప్పుడు మరోసారి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించింది.
తనను హత్య చేయాలనే ఉద్దేశంతోనే శ్యామ్ కె నాయుడు ఇలా చేసి ఉంటాడని ఆమె ఆరోపణలు చేస్తుంది. దీంతో మరోసారి వీరిద్దరి వ్యవహారం వార్తల్లో నిలిచింది.
Most Recommended Video
చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!