నటులు దర్శకులుగా మారి సక్సెస్ సాధించడం చాలా అరుదు. అయితే ఆసరాల శ్రీనివాస్ ఆ మాటకి బదులుగా మారారిప్పుడు. తొలి సినిమా “ఊహలు గుసగుసలాడే” ఇటీవల తెరమీదికొచ్చిన శ్రీని మలి చిత్రం “జ్యో అచ్యుతానంద”తో సూపర్ హిట్స్ కొట్టాడు. ఇప్పుడు ఆయనతో సినిమా తీయడానికి పరిశ్రమలో అందరు నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. అలాంటిది ఆయనకు నిర్మాతల కష్టాలేమిటంటే.. ఇది ఆయన గతానికి సంబంధించిన విషయం.
శ్రీని నటుడిగా ఉన్నప్పుడే ఓ నిర్మాతకు “ఊహలు గుసగుసలాడే” సినిమా కథ వినిపించారట. కథ విన్న సదరు నిర్మాత “మీరు దర్శకుడిగా నిలబడరు. మీలో దర్శకుడి లక్షణాలు మచ్చుకైనా కనపడవన్నారట”. ఇక మరో నిర్మాతైతే తనకు నచ్చిన ఓ కథ అమ్మలేదని సుమారు నాలుగేళ్ళ పాటు అవమానించారట. అయితే దీనివల్ల కసి పుట్టుకొచ్చి దర్శకుణ్ణి కాలేదన్న శ్రీని సినిమా పట్ల తనుకున్న అభిమానమే దర్శకుణ్ణి చేసిందని చెప్పుకొచ్చారు.